ఉన్నత విద్య లక్ష్యం..గ్రామీణాభివృద్ధి కోసం

ఉన్నత విద్య ముఖ్య ఉద్దేశం గ్రామాల అభివృద్ధి కోసం సాగాలని ఏపీ రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌ అభిప్రాయ పడ్డారు.   నాగార్జున యూనివర్సిటీలో మహాత్మా గాంధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌, యునిసెఫ్‌ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మన మధ్య లేరు. కానీ ఆయన ఆచరించిన విలువలు, శాంతి మార్గం ఎందరికో ఆదర్శ ప్రాయంగా నిలిచింది. విద్య వ్యాపారాత్మకంగా కాకుండా సమాజాభివృద్ధి కోసం సాగాలని మహాత్ముడు కోరుకున్నారు. అందుకే ఆయనను నేటికీ యావత్ ప్రపంచం ఆచరిస్తోంది. గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ దేశంలో సాంఘిక, ఆర్థిక ఎదుగుదల కోసం, నైతిక విలువలు పెంపొందించడం కోసం గాంధీజీ కృషి చేశారు.

మహాత్ముడు చెప్పినట్లు, నా హృదయం ఎప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుందన్న నినాదాన్ని విద్యార్థుల్లో నాటుకునేలా ఉపాధ్యాయులు, ఆచార్యులు, మేధావులు, సామాజికవేత్తలు పాటు పడాలని హరిభూషణ్ పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించు కునేలా ఎన్నో ప్రయత్నాలను చేస్తోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సరైన విద్య కొనసాగితేనే దేశ ఆర్థికాభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. పల్లె ప్రాంతాల్లో కనీస వసతులు, జీవన స్థితిగతులను మెరుగు పర్చడానికి ఉన్నత విద్యా సంస్థలు ప్రణాళికలు రూపొందించాల్సిన సరైన సమయం ఇదేనన్నారు.

విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలను సందర్శించే విధంగా, సామాజిక బాధ్యత కోసం పీజీ స్థాయిలో పాఠ్యాంశాలు పొందు పర్చాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి తోనే దేశాభివృద్ధి, జాతి పురోభివృద్ధి లభిస్తుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఏపీలోని యూనివర్సిటీలు మహాత్మా గాంధీ పేరుతో గ్రామీణాభివృద్ధికి అనుగుణంగా ఇనిస్టిట్యూట్లను ఏర్పాటు చేయాలని, తద్వారా ఆయా గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  ప్రసాద్‌ అన్నారు. పీజీ, పీహెచ్‌డీల ద్వారా వస్తున్న పరిశోధనాత్మక ఫలితాలు సమాజానికి ప్రయోజనకరంగా మారాలని కోరారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!