ఈజీ బిజినెస్ లో ఇండియా బెటర్


మోదీ సంస్కరణలు కొంత మేర ఫలితాలు ఇస్తున్నాయి. తాజగా ఈజీ బిజినెస్ నిర్వహించే విషయంలో ఇండియా ప్లేస్  పెరిగింది. ప్రపంచ బ్యాంకు ఈ ఏడాదికి ప్రకటించిన ర్యాంకుల్లో భారత్‌కు 63వ స్థానం లభించింది. ఒక్క సారిగా  భారత్‌ 14 స్థానాలు దాటడం విశేషం. ప్రభుత్వం తీసుకున్న పలు విధానాలు ఇందుకు దోహద పడ్డాయి. భారత్‌లో తయారీ పథకంతో పాటు ఇతర కీలక సంస్కరణలతో ఇండియా విదేశీ పెట్టుబడులను ఆకర్షించ గలిగింది. మరోవైపు టాప్‌ 10 పెర్‌ఫార్మర్స్‌ జాబితాలో వరుసగా మూడో సారి భారత్‌కు చోటు దక్కడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంద గమనం నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు , ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి  లతోపాటు వివిధ రేటింగ్‌ ఏజెన్సీలు భారత్‌ వృద్ధి రేటు అంచనాను తగ్గించాయి.

ఇదే సమయంలో ర్యాంకింగ్స్‌ వెలువడటం విశేషం. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి 190 దేశాల్లో భారత్‌ స్థానం 142గా ఉంది. నాలుగేళ్ల పాటు చేపట్టిన వివిధ సంస్కరణలతో ఇండియా స్థానం డూయింగ్‌ బిజినెస్‌ 2018 నివేదికలో 100కు చేరుకుంది. గత ఏడాదిలో భారత్‌ 23 స్థానాలు ఎగబాకి 77కు చేరుకుంది. దివాలా, పన్నులు, ఇతర విభాగాల్లో చేపట్టిన సంస్కరణలు భారత్‌ పని తీరు మెరుగు పడేందుకు దోహద పడ్డాయి.

ఈసారి టాప్‌ 10 పెర్‌ ఫార్మర్స్‌ జాబితాలో మనతో పాటు సౌదీ అరేబియా,  జోర్డాన్‌,  టాగో,  బహ్రెయిన్‌, తజకిస్తాన్‌, పాకిస్తాన్‌, కువైట్‌ , చైనా,  నైజీరియా ఉన్నాయి. ఏ మేరకు ఇండియా చేపట్టిన సంస్కరణలను వరల్డ్ బ్యాంకు ప్రసంశలతో ముంచెత్తింది. ఇదిలా ఉండగా భారత విత్త మంత్రి నిర్మల సీతారామన్ మాత్రం వాస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ ని మరింత సులభతరం చేస్తామని చెప్పారు. దీని వల్ల మరింత ఆదాయం సమకూరే ఛాన్స్ ఉందన్నారు ఆమె. 

కామెంట్‌లు