దివాళా అంచున ఆర్ కామ్
రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లలో టెలికాం సెక్టార్ లో జియో దూసుకు పోతుండగా, అనిల్ అంబానీ చైర్మన్ గా ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ మాత్రం రోజు రోజుకు కోలుకోలేని స్థితికి చేరుకుంటోంది. ముకేశ్ అంబానీ భారతీయ ఆర్ధిక, మార్కెట్ రంగాన్ని శాసిస్తుండగా అనిల్ మాత్రం బేల చూపులు చూస్తున్నారు. ఇప్పటికే టెలికాం, ఆయిల్, ఫ్యాషన్, ఫాబ్రిక్స్, జ్యుయెలరీ, ఫుడ్, షూస్, తదితర రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వెళుతున్నారు. ముకేశ్ అంబానీ పకడ్బందీ ప్రణాళికతో ఒక్కో అడుగు వేసుకుంటూ తన కంపెనీలను పరుగులు పెట్టిస్తున్నారు. ఆదాయ బాట పట్టిస్తున్నారు. దీంతో తాజాగా ఆయా కంపెనీల షేర్ అమాంతం పెరిగాయి.
మదుపరులకు భారీగా ఆదాయం సమకూరింది. ఇదే సమయంలో ఆర్ కామ్ మాత్రం కోలుకోలేని రీతిలో నష్టాలను కొనితెచ్చుకుంటోంది. దీనిని గాడిలో పెట్టేందుకు ముకేశ్ అంబానీ రంగంలోకి దిగారు. అనిల్ అంబానీకి వెన్ను దన్నుగా నిలిచారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో ఆర్ కామ్ కు ఏకంగా 30,142 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం దివాలా ప్రక్రియ నడుస్తున్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో 1,141 కోట్ల నికర లాభం ఆర్జించింది. సవరించిన స్థూల రాబడి విషయమై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కారణంగా 28,314 కోట్ల కేటాయింపులు జరపడంతో ఈ కంపెనీకి ఈ క్యూ2లో నష్టాలు వచ్చాయి.
కాగా గత క్యూ2లో 977 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ క్యూ2లో 302 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆర్‌కామ్ షేర 3.2 శాతం నష్ట పోయి 0.59 వద్ద ముగిసింది. ఇక నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్ సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో 394 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి 443 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవరు 245 కోట్ల నుంచి 115 కోట్లకు చేరింది. కాగా నష్టాల్లో కొనసాగుతున్న ఆర్ కామ్ ను ఎలాగైనా సరే గట్టెక్కిస్తామని స్పష్టం చేశారు ఇటీవల జరిగిన కంపెనీ సమావేశంలో ముకేశ్ అంబానీ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి