మనదే టీ-20 సిరీస్


భారత క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్టున్నాయి. ఓ వైపు నిబద్దత, నిజాయితీ కలిగిన, మాజీ సారధి, బెంగాలీ దాదా సౌరభ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాక దీని రూపు రేఖలు పూర్తిగా మార్చేసే పనిలో పడ్డాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన, ఆదాయం కలిగిన బిసిసిఐకి ఇప్పుడు అతడే బాస్. పూర్తిగా ఆటపైనే దృష్టి సారించాడు. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు సముచిత స్థానం ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నాడు. దీంతో నిన్నటి దాకా అంతగా సపోర్ట్ లేక ఇబ్బందులు పడిన మహిళా ప్లేయర్స్ ఇప్పుడు ఆటలో దుమ్ము రేపుతున్నారు.

తాజాగా వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉన్న మన మహిళా జట్టు ఇప్పటికే పలు మ్యాచుల్లో విజయం సాధించింది. మిథాలీ రాజ్, స్మృతి మందన్న, తదితర ఆటగాళ్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. టి20 క్రికెట్‌ జట్టు ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌పై ‘హ్యాట్రిక్‌’ విజయం నమోదు చేశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది టీమిండియా. గయానాలో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 59 పరుగులే చేసింది.

భారత బౌలర్లలో రాధా యాదవ్‌, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీయగా..అనూజా పాటిల్, పూజా వస్త్రకర్, హర్మన్‌ప్రీత్‌ కౌర్, పూనమ్‌ యాదవ్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది. విండీస్‌ జట్టులో చెడీన్‌ నేషన్‌, చినెల్లి హెన్రీ మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం భారత్‌ 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ సున్నాకే వెనుదిరిగినా  స్మృతి మంధాన , హర్మన్‌ లు తక్కువ స్కోర్లకే అవుటయ్యాడు. ఇదే సమయంలో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్‌ 51 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఆమెకు దీప్తి శర్మ తోడుగా నిలవడంతో ఇండియా సునాయాసంగా గెలుపొందింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!