ఫ్యాన్స్ ఖుష్..దాదా జోష్


భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్, మాజీ టీమిండియా సారధి సౌరభ్ గంగూలీ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఆయన పగ్గాలు చేపట్టాక బిసిసిఐ రూపు రేఖలు మార్చే పనిలో దృష్టి పెట్టాడు. భారీ ఆదాయం కలిగినక్రీడా సంస్థగా ప్రపంచంలోనే పేరుంది. దీనిలో పదవి దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఇండియాకు ప్రైమ్ మినిష్టర్ కావడం చాలా తేలిక, కానీ ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రెసిడెంట్ కావడం చాలా కష్టమని క్రికెట్ పండితులు ఎప్పుడో సెలవిచ్చారు. నీతి, నిజాయితీ, దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తిగా గంగూలీకి పేరుంది. అంతే కాదు ఈ బెంగాలీ బాబుకు అటు బెంగాల్ లో ఇటు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉంది. మాజీ టీమిండియా లెజెండ్ మహమ్మద్ అజహరుద్దీన్ నేతృత్వంలోనే గంగూలీ తన క్రికెట్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు.

అందుకే ఈ దాదాకు అజ్జూ భాయ్ అంటే అభిమానం. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఉత్సవాలకు ప్రత్యేకంగా తనను ఆహ్వానించాడు. అంతే కాదు బిసిసిఐ పదవి చేపట్టాకా అజ్జుతో కలిసి ఏం చేయాలన్న దానిపై సూచనలు తీసుకున్నాడు. అజహరుద్దీన్ సారధిగా ఉన్న సమయంలోనే ద్రావిడ్, గంగూలీ, కుంబ్లే, సిద్దు, ఇలా ఎందరో వెలుగులోకి వచ్చారు. ప్రతి ఒక్కరికే ఆడే ఛాన్స్ ఇచ్చాడు అజ్జూ. కానీ బాంబే లాబీ ఈ హైదరాబాదీని ఒప్పుకోలేదు. తాజాగా గంగూలీ టెస్ట్ మ్యాచ్ ను డే అండ్ నైట్ మ్యాచ్ గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ఈ టెస్టు మ్యాచ్ కు టికెట్లన్నీ అమ్ముడు పోయాయి.

దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాంచి జోష్ఉ మీదున్నాడు. తొలి మూడు రోజుల ఆటకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడు పోయిన విషయాన్ని గంగూలీ  స్పష్టం చేశాడు. ఇలా టెస్టు మ్యాచ్‌కు టికెట్లు అమ్ముడు పోవడంతో హ్యాపీగా ఉన్నామన్నాడు. ఆన్‌లైన్‌లో పెట్టిన టికెట్లన్నీ సేల్‌ అయి పోయాయ్‌. కేవలం కోటా టికెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమిత సంఖ్యలో ఉన్నాయి.   మేమంతా సంతోషంగా ఉన్నాం  అని గంగూలీ పేర్కొన్నాడు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య డే అండ్‌ నైట్‌ టెస్టు జరుగనుంది.

ఇది ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం పగటి పూట టెస్టు కాగా, బీసీసీఐ అధ్యక్ష హోదాలో దాన్ని డే అండ్‌ నైట్‌గా నిర్వహించాలనే గంగూలీ పట్టుబట్టారు. ఆ క్రమంలోనే బంగ్లాదేశ్‌ బోర్డును కూడా ఒప్పించారు. ఫలితంగా భారత్‌ మొదటి సారి డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది.  ప్రేక్షకులు అధిక సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేశారు. ఆఫీసులు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను చూడటానికి జనం వస్తారనే ఆలోచనతోనే ఇలా డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ను నిర్వహించడానికి గంగూలీ నిర్ణయం తీసుకున్నాడు. తన ఆలోచన సక్సెస్‌ కావడంతో గంగూలీ హ్యాపీగా ఉన్నాడు. మున్ముందు ఇంకెన్ని మార్పులు తీసుకు వస్తాడో వేచి చూడాలి.

కామెంట్‌లు