ఆత్మహత్యలకు పాల్పడకండి..భవిష్యత్ ఎంతో ఉంది - హీరో రామ్
తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఇంటర్ బోర్డు నిర్వాకంపై పలువురు హీరోలు స్పందిస్తున్నారు. వారిలో ఆత్మ స్థయిర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. జీవితం ఒక్కసారే వస్తుందని, అన్ని సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం కాదని వారు సూచించారు. నిన్న జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఏది ఏమైనా ..పిల్లలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలి. బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలి. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడకండి. ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మరికొంత మంది ముందుకు వచ్చారు. జూనియర్ ఆర్టిస్టులు సైతం తమ మద్ధతు తెలిపారు. మానసికంగా కుంగి పోవద్దని, అవకాశాలు అనేకం ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీలైతే తామంతా మీ వెనకే ఉంటామని అన్నారు. ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించే అలవాటు వున్న హీరో రామ్ . యంగ్ అండ్ ఎనర్జటిక్ గా ఎప్పుడూ నవ్వుతూ..నవ్విస్తూ వుండే నటుడిగా రామ్‌కు పేరుంది. షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ ..విషయం తెలుసుకున్న రామ్ తన స్పందనను తెలియ చేశారు. లెజండరీ క్రికెటర్ సచిన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవరూ చేరుకోలేని మైలురాళ్లను అధిగమించిన సచిన్ టెండూల్కర్ కూడా ఇంటర్ పూర్తి చేయలేదన్న విషయం గుర్తుంచు కోవాలని విద్యార్థులకు హితవు పలికారు రామ్. పార్కుల్లో కూర్చుని బిస్కట్లు తినే పిల్లలకు ఏదైనా చెబితే వింటారు. కానీ బెడ్ రూమ్‌లలో తాళం వేసుకుని జీవితం ఎలా ..ఇలా అయ్యిందేమిటని అనుకునే విద్యార్థులకు ..నిజాలు ఈ విధంగా చెబితే వింటారని అన్నారు.
ఇంటర్ కూడా పూర్తి చేయలేదని తాను ఎప్పుడూ సచిన్ మనస్తాపానికి గురి కాలేదన్నారు. పట్టుదలతో ..క్రమశిక్షణతో తాను అనుకున్నది సాధించాడని, దేశం గర్వించదగిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడని తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలే లైఫ్ అని అనుకునే తమ్ముళ్లు, చెల్లెళ్లకు నా విన్నపం ఒక్కటే..మీరు జీవితంలో అవ్వబోయే దానికి..చేయ బోయే దానికి ..ఇది స్టార్టింగ్ మాత్రమే..దయచేసి రిజల్ట్స్‌ను లైట్‌గా తీసుకోండి..ఈ పరీక్షలు కాకపోతే ..మరో అవకాశం ఉందని గుర్తుంచుకోండి..ఆత్మహత్యలకు మాత్రం పాల్పడకండి అంటూ కోరారు. నేను కూడా ఇంటర్ పూర్తి చేయలేదని, అయినా హీరోగా నిలదొక్కుకున్నానని విద్యార్థులకు హితవు పలికారు. ధైర్యం నింపే ప్రయత్నం చేశారు రామ్. టాలీవుడ్ కు చెందిన మిగతా టెక్నిషియన్స్, నిర్మాతలు ముందుకు రావాలి. పిల్లలకు తమ మద్ధతును ప్రకటించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి