నేస్తం నువ్వే సమస్తం - వల్లబదాస్ స్మతిలో..!
పాలమూరు జిల్లా వీరులను కన్నది. అత్యంత ప్రతిభావంతులను చేసింది. ఉద్యమకారులను..పోరాట స్ఫూర్తిని..త్యాగధనులను..విజేతలను..మేధావులను ..తాత్వికులను..గాయనీ గాయకులను..కష్టజీవులను అందించింది. ఈ మట్టిలో పుట్టి..దీనిలోనే తక్కువ కాలంలోనే ఇక సెలవంటూ వెళ్లి పోయాడు..మా వల్లబదాస్ మహేందర్ గౌడ్. మరికల్ మండలం జిన్నారం ఊరులో పుట్టిన మహేందర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మమ్మల్ని వీడి ఇవాళ్టితో ఏడాది గడిచింది. గ్రూప్ -1 ఆఫీసర్ గా అద్భుతమైన నైపుణ్యం, సునిశితమైన తార్కిక విశ్లేషణ, రాయడంలో, చదవడంలో, విశ్లేషించడంలో మా కంటే ఆయన ముందున్నారు.
గుండె నిండా ప్రేమను..మానవత్వాన్ని కలిగిన స్నేహితుడు దూరం కావడం బాధాకరం. కాలం ఎంత విచిత్రకరమైన పరిస్థితిని కలుగ చేసిందో తలుచుకుంటేనే కన్నీళ్లు కారి పోతున్నవి. మా ఇద్దరి మధ్య రెండేళ్ల స్నేహం మాత్రమే. కానీ మరిచి పోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సైన్స్, ఐటీ, సోషల్ మీడియా, న్యాయపరమైన ప్రతి రంగంలో ఆయనకు అపరితమైన అనుభవం ఉన్నది. ప్రతి అంశం పట్ల కూలంకుశమైన అవగాహన, రాయగల నేర్పు బహుషా ఎవ్వరికీ లేదనే చెప్పాలి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గౌడ్..కష్టాలు..కన్నీళ్లను దాటుకుని నిలబడ్డారు. ఆటుపోట్లను అధిగమించి అధికారిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు.
వృత్తి పరంగా వత్తిళ్లు ఉన్నప్పటికీ ..ప్రవృత్తి పరంగా గొప్ప మానవతావాది. ఎంత వత్తిళ్లు వచ్చినా..ఎప్పుడూ జీవాలను ప్రేమించాడు..పుస్తకాలను అంతకంటే ఎక్కువగా గౌరవించాడు. ఆంగ్ల భాష పట్ల ప్రేమ..మరింత పట్టు సాధించేలా చేసింది. చాలా మంది ఎలా సంపాదించాలో ఆలోచిస్తే..గౌడ్ మాత్రం మార్కెట్లో ఏ కొత్త పుస్తకం వచ్చిందో వెతికేవారు. నోట్ ఫైల్స్ రాయడంలో ఆయనకు ఆయనే సాటి. వాటిని క్లియరెన్స్ చేయడం..ప్లాన్స్ రూపొందించడం..డిఫరెంట్‌గా ఆలోచించడం..ఇతరులు ఆశ్చర్య పోయేలా బ్రీఫ్‌గా నోట్ రూపొందించడంలో వెరీ వెరీ ఎక్స్ పర్ట్. జర్నలిస్ట్ మోహన్ గౌడ్ గౌడ్ దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశాడు. అన్నా సేమ్ టు సేమ్..మీలాగే చదువుతాడు..రాస్తాడు..ఆలోచిస్తాడు..అని చెప్పంగానే నవ్వారాయన. ఎంతో మంది అధికారులను కలిశా..వృత్తి పరంగా..కొద్ది మందిని మాత్రమే చూశా. పలకరించడంలో..హోదాను పక్కన పెట్టి ..గౌరవించడంలో..గౌడ్ అందరికంటే ముందంజలో నిలుస్తారు.
ఎప్పుడైనా కార్యాలయానికి వెళితే..వేడి కాఫీ..చర్చోపచర్చలు..రాజకీయాలు..కరెంట్ అఫైర్స్..ఆపై సబ్జెక్ట్స్..అంతలోపే పసందైన..అన్ని రుచులు మేళవించిన భోజనం..మళ్లీ పుస్తకాలు..రివ్వ్యూలు..రచయితలు..గాయకులు..పొలిటికల్ లీడర్ల గురించి..అనర్ఘలంగా మాట్లాడేవారు. అటవీ శాఖకు సంబంధించి లోతైన నాలెడ్జ్ ఆయనకు వుండేది. మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే ..పాజిటివ్ దృక్ఫథాన్ని కలిగి ఉండాల్సిందే..లేకపోతే కొన్ని తరాల పాటు సమాజాన్ని గుప్పిట్లో వుంచుకుని పవర్ మేకింగ్ పర్సన్స్‌గా ఉన్నటువంటి ..ఉన్నత వర్గాలకు చెందిన వారు మనల్ని ఓ పట్టాన బతకనీయరన్న వాస్తవాన్ని తెలియ చెప్పారు. నువ్వు ఎన్నైనా చెప్పు ..బాస్..కులం ఇవాళ అన్నింట్లోకి జొరబడింది. అది ఆక్టోపస్ లా విస్తరించింది..మనల్ని అట్టడుగునే ఉండేలా చేస్తోంది. చట్టాలు చేసే స్థాయిలో కూడా ఆ కులమే పనిచేస్తోందని కుండబద్దలు కొట్టారు.
ఒకటా రెండా వేలాది పుస్తకాలు ఆయన సెల్ఫ్‌లో ఉన్నాయి. మరో మిత్రుడు సాంబశివరావు రాసిన సంత్ గాడ్గే బాబా పుస్తకాన్ని ఇద్దామని అనుకున్నా..అంతలోపే వృత్తి నిర్వహణలోనే ఆయన తుది శ్వాస విడిచారు. మమ్మల్ని శోకసంద్రంలో ముంచి వెళ్లారు. గొప్ప ఆలోచనపరుడు..నిత్య చైతన్యవంతమైన వ్యక్తి..అద్భుతమైన విజ్ఞాన సర్వస్వం..ఉన్నతమైన భావాలు..నిండైన వ్యక్తిత్వం కలిగిన ..వల్లబదాస్ మహేందర్ ..అలా నిర్జీవంగా పడుకోవడం చూసిన ఆ క్షణాలు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఇవాళ జడ్చర్ల..మహబూబ్‌నగర్ రహదారిలో ..అప్పన్నపల్లి దగ్గర
అత్యంత పాపులర్ నర్సరీగా పేరొందిన మయూరీ నర్సరీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన ఘనత మహేందర్ గౌడ్ దే. పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ను శీనన్న అంటూ ఆప్యాయంగా పిలిచే వారు.. ఇపుడు గౌడ్ లేడు..ఇంకా నమ్మబుద్ది కావడం లేదు. ఇక సెలవంటూ వెళ్లి పోయి ..ఏడాదవుతోందా..నేస్తం ..నువ్వే సమస్తం అనుకుంటూ ..నివాళి అర్పించడం తప్ప ..ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలి. అల్విదా ..వల్లబదాస్..!

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి