పెద్ద‌న్న విల‌విల

 ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికా ఇప్పుడు ఒకే ఒక్క ప‌దాన్ని చూసి జ‌డుసుకుంటోంది. నిన్న‌టి దాకా ఇత‌ర దేశాల‌ను ఆయుధాల పేరుతో నానా యాగీ చేస్తూ, అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తూ, మార‌ణ హోమానికి ప‌రోక్షంగా కార‌ణ‌మ‌వుతూ..ఆర్థిక రంగాన్ని అత‌లాకుత‌లం చేస్తూ వ‌చ్చిన పెద్ద‌న్నకు కంటి మీద కునుకే లేకుండా పోయింది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి రోజు రోజుకు పెరుగుతోంది త‌ప్పా త‌గ్గ‌డం లేదు. అన్ని దేశాలు లాక్ డౌన్ లు ప్ర‌క‌టించాయి. ఎక్క‌డిక‌క్క‌డ జ‌నాన్ని ఇళ్ల‌లోనే ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. దేశాధినేత‌లు సైతం ఏం చేయాలో తోచ‌క త‌ల్ల‌డిల్లుతున్నారు. చిన్నా పెద్దా ధ‌నిక పేద తేడా అంటూ లేకుండా పోయింది ఈ వైర‌స్ దెబ్బ‌కు. ఎక్క‌డిక‌క్క‌డ అన్ని రంగాలు మూసుకున్నాయి. ఎగుమ‌తులు, దిగుమ‌తులు నిలిచి పోయాయి. కోట్లాది మంది దీని బారిన ప‌డ్డారు. లెక్క‌లేనంత మంది మృత్యువాత‌కు గుర‌వుతున్నారు.

అయినా ఎక్క‌డా ఈ వైర‌స్ ను నిలిపి వేయ‌లేక పోతున్నారు వైద్యులు, శాస్త్ర‌వేత్త‌లు. ప్ర‌పంచ వ్యాప్తంగా 8 ల‌క్ష‌ల 60 వేల‌కు చేరింది. 220 దేశాల‌ను క‌రోనా క‌బ‌ళించింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా చూస్తే అమెరికా టాప్ ఒన్ లోకి చేరింది. అయితే ప్ర‌పంచం ఇపుడు బేల చూపులు చూస్తోంది. క్యూబాపై ఆర్థిక ఆంక్ష‌లు విధించిన అమెరికా త‌మ దేశంలో బాధితుల చికిత్స కోసం ఇపుడు బేల చూపులు చూస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే ఎక్కువ‌గా వైద్య నిపుణులు ఉన్న‌ది ఒకే ఒక్క కంట్రీ క్యూబా. ఇప్ప‌టి దాకా ఉత్త‌ర కొరియా, చైనా, ర‌ష్యా దేశాలు మాత్ర‌మే కొంచెం కంట్రోల్‌లో ఉన్నాయి. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నాయి. కేసులు, బాధితుల సంఖ్య మాత్రం ఆశించిన మేర లేక పోవ‌డం శుభ‌ప‌రిణామం. ఇండియాలో బాధితుల సంఖ్య పెరుగ‌తోంది. టెస్టింగ్ కాస్ట్ 5 వేల రూపాయ‌ల ఖ‌ర్చ‌వుతోంది.
ఇంకో వైపు ప్రాథ‌మిక సౌక‌ర్యాలు, వ‌స‌తుల క‌ల్ప‌న‌లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైందంటూ డాక్ట‌ర్లు, న‌ర్సులు ఆరోపించారు. మ‌రో వైపు అమెరికా జ‌పం చేస్తూ అక్క‌డికి వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులు త్రిశంకు స్వ‌ర్గంలో ఉన్నారు. ప‌రిస్థితి చేయి దాటి పోవ‌డంతో సామాజిక దూరం మాత్ర‌మే పాటించ‌డం త‌ప్ప మరో మార్గం లేదంటూ ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు, వైద్యులు, నిపుణులు విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు. కోట్లాది రూపాయ‌లు కేటాయిస్తున్న‌ట్లు అటు కేంద్రం ప్ర‌క‌టించినా ఈరోజు వ‌ర‌కు పెద్ద ఎత్తున నిధులు కావాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. ఆయా రాష్ట్రాలు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు కోసం కృషి చేస్తున్నా కంట్రోల్ కావ‌డం లేదు. భారీ ఆయుధాల బ‌ల‌గాన్ని చూసి మిడిసి ప‌డిన ట్రంప్ ల‌క్ష మందికి పైగా చ‌నిపోవ‌చ్చంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. ఇంకో వైపు ఐటీ కంపెనీలు సందిట్లో స‌డేమియా అన్న చందంగా ఐటీ కంపెనీలు పింక్ స్లిప్‌లు ఇవ్వ‌డం మొద‌లు పెట్టాయి. దీంతో ఐటీ ప్రొఫెష‌న‌ల్స్, ఎక్స్ ప‌ర్ట్స్ , టీం లీడ‌ర్స్ ల‌బోదిబోమంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!