జనహితమే జెండా..సమస్యలే ఎజెండా
ఘనమైన చరిత్రను స్వంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినా సమస్యలపై పోరాటం చేస్తూ వస్తోంది. డైనమిక్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. మరో వైపు అటు ఏపీలో ఇటు తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు శతవిధాలుగా కృషి చేస్తూ వస్తున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు రావాలన్న కృత నిశ్చయంతో అధినేత ముందుకు సాగుతున్నారు. వయసు మీద పడుతున్నా లెక్క చేయకుండా చంద్రబాబు ముందుకే సాగుతున్నారు. ప్రజల్లో భరోసా నింపుతున్నారు. నిత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇదే సమయంలో యువతపై ఎక్కువగా దృష్టి పెట్టారు.
గ్రామ స్థాయి నుంచి పట్టణ, నగర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున కేడర్ ఉన్నది. అందుకే చంద్రబాబు ప్రత్యేకంగా డైనమిజం కలిగిన యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో పరిటాల ఫ్యామిలీకి ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్రకు తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఫాలోయింగ్ ఉంది. లక్షలాది మంది ఇప్పటికీ రవిని తల్చుకుంటారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న పరిటాల శ్రీరామ్ ఇపుడు యూత్‌కు అండగా వుంటూ వస్తున్నారు. అందివచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ దూసుకెళుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలైనప్పటికీ పార్టీ బలహీనం కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ తన పవర్ ఏమిటో చూపిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి