సాన్యా సంచలనం..పుస్తక ప్రభంజనం..!

 

లోగ్ క్యా కహేంగే..అంటూ సాన్యా ఖురానా రాసిన పుస్తకం దేశ వ్యాప్తంగా అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తోంది. వృత్తి రీత్యా సాఫ్ట్ వెర్ ఇంజనీర్ అయిన ఈ అమ్మాయి రాయడంలో అందెవేసిన చెయ్యి. తన మీద తనకు అపారమైన నమ్మకం , ఆత్మ విశ్వాసం కలిగిన ఈమె అనుకోకుండా రచయిత్రిగా మారారు. అంతకు ముందు ఆమె అడోబ్ ఐటి కంపెనీలో పని చేశారు. మహిళా సాధికారతకు దర్పణంగా నిలిచేలా ప్రత్యేక కథనాలు రాశారు. సాన్యా రాసిన పుస్తకం రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే పెద్ద ఎత్తున అమ్ముడు పోయాయి. అమెజాన్ కంపెనీలో ఇప్పుడు ఈ బుక్ సంచలనం రేపుతోంది. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సాన్యా పర్యటించారు. ఈ జర్నీలో ఎందరినో కలిశారు. వారితో మాట్లాడారు.

ఆ అనుభవాలనే అక్షరబద్దం చేశారు. ఈ పుస్తకం ఇప్పుడు వేలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఖురానాకు కాసులు కురిపిస్తోంది. ఒక్క రోజులోనే ఆమె మోస్ట్ పాపులర్ రైటర్ గా పేరు సంపాదించారు. వుమెన్ డ్రీమ్స్ అండ్ యాంబిషన్స్ నే ఆమె టార్గెట్ గా పెట్టుకున్నారు. లీన్ ఇన్ ఇండియా పేరుతో ఓ సంస్థను ఖురానా స్థాపించారు. ఒక రోజు ఆమె తండ్రి తనకు చదువుకునేందుకు ఓ పుస్తకం చేతిలో పెట్టారు. అందులో మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఉన్నాయి. ఇవ్వన్నీ సాన్యా ఖురానాను కదిలించి వేశాయి. అత్యంత నాటకీయతతో హృదయాలను హత్తుకునేలా ఆమె అక్షరబద్దం చేసిన తీరు ప్రశంసనీయం. జీవితంలో , సమాజంలో మహిళలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. వారు పడుతున్న ఇబ్బందులు ఏమిటి. అసలు వాళ్ళు ఏం కోరుతున్నారు.

ఎలాంటి ఆశలు, ఆశయాలు, కలలు, ఆలోచనలు, లక్ష్యాలు ఉన్నాయో సాన్యా స్వయంగా ఇంటరాక్ట్ అయ్యారు. అందుకే పుస్తకం అంత బాగా వచ్చింది. ఎంతో మందిని కలిపేలా చేస్తోంది. మానసికంగా , శారీరకంగా ఎలాంటి ఇబ్బందులకు లోనవుతున్నారో తెలియ చేసే ప్రయత్నం చేశారు. లీన్ ఇన్ ఇండియా పరంగా రెండేళ్ల పాటు దేశంలో పర్యటించేలా అవకాశం దక్కించుకుంది. ఈ సందర్బంగా వివిధ ప్రాంతాలలో భిన్నమైన వ్యక్తులను కలుసుకుంది. ఇది ఆమె కెరీర్లో అత్యున్నతమైన స్థానం పొందేందుకు దోహదం చేసింది. జెండర్ ఈక్వాలిటీ మీద కూడా రీసర్చ్ చేశారు. సామాన్యుల నుంచి అసామాన్యులు దాకా మహిళలను కలుసుకున్నారు. అత్యంత ధైర్య సాహసాలు కలిగిన యువతుల ఆలోచనలు పంచుకున్నారు.

బతుకును జయించిన వారి గాధలను విన్నారు. అంతే కాకుండా సమస్యలను, కష్టాలను అధిగమించిన పోరాట స్ఫూర్తి కలిగిన మహిళలతో సంభాషించారు. వారితో కలిగిన అనుభవాలను పుస్తకంగా తీసుకు వస్తే బావుంటుందని తన స్నేహితురాలు చెప్పింది. అదే పుస్తక రూపంలో బయటకు వచ్చింది. ప్రతి ఒక్కరికి ఓ కథ ఉంటుంది. అది వారి మాటల్లో వింటేనే బావుంటుంది. పుస్తకం అంటే విజేతల గురించిన కథలు కాదు కావలసింది .. ఓడి పోయిన వాళ్ళది కూడా ..అంటున్నారు సాన్యా ఖురానా. అవును వయసు రీత్యా చిన్నదే అయినప్పటికీ గొప్పనైనా మాట సెలవిచ్చింది కదూ. వీలైతే అమెజాన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో , బుక్ హౌసెస్ లలో కూడా లోగ్ క్యా కహేంగే దొరుకుతోంది. వీలైతే చదవండి.

కామెంట్‌లు