యూట్యూబ్ బంపర్ ఆఫర్
టెక్ దిగ్గజం గూగుల్ తర్వాతే ఏదైనా. ఇప్పటికే ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ఈ కంపెనీ ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అదో అతి పెద్ద సంచలనం. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా తన కంటూ బ్రాండ్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న సదరు కంపెనీ, ప్రతి ఫార్మాట్ లో టాప్ రేంజ్ లో కొనసాగేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఓ వైపు మైక్రో సాఫ్ట్ , తదితర కంపెనీలు రంగంలో ఉన్నా సెర్చింగ్ కేటగిరీలో మాత్రం గూగుల్ కంపెనీదే హవా. దాని దరి దాపుల్లోకి ఇప్పట్లో వచ్చేందుకు ఏ ఐటీ కంపెనీ సాహసం చేయలేక పోతోంది. ఆండ్రాయిడ్ వెర్షన్ ను డెవలప్ చేయాలన్నా, క్లౌడ్ సేవలు వినియోగించు కోవాలన్నా , డిజిటల్ టెక్నాలజీ వాడు కోవాలన్నా గూగుల్ మీదే ఆధార పడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది.
గూగుల్ కంపెనీకి చెందిన యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ప్రతి రోజు కోట్లాది వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. లెక్కలేనన్ని వీడియోలను జనం చూస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ మరింత విస్తరించడంతో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ను వేదికగా చేసుకుంటున్నారు. తమ ప్రతిభకు మెరుగులు దిద్దుతూ , క్రియేటివిటీని జోడిస్తూ లక్షలు పోగేసుకుంటున్నారు. ఎలాంటి టెక్నాలజీ నాలెడ్జ్ లేకుండానే దర్జాగా బతికేస్తున్నారు. తాజాగా గూగుల్ ఇండియాతో డిజిటల్ సేవలు ప్రభుత్వానికి అందజేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ దిగ్గజ కంపెనీకి మన ఇండియన్ సుందర్ పిచ్చాయ్ సీయీవోగా ఉన్నాడు. తాజాగా గూగుల్ కీలక ప్రకటన చేసింది. ఇండియాకు చెందిన ఎనిమిది భారతీయ కంటెంట్ తయారీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఎగ్జామ్ ఫియర్, లెర్న్ ఇంజనీరింగ్ , డోంట్ మెమొరీస్, స్టడీ ఐక్యూ ఎడ్యుకేషన్ , డార్ట్ ఆఫ్ సైన్స్ , లెర్నెక్స్, గెట్ సెట్ ఫ్లయ్ , లెట్స్ మేక్ ఇంజనీరింగ్ సంస్థలు ఉన్నాయి. యూట్యూబ్ ఫండ్ నుంచి కంటెంట్ అభివృద్ధి చేసేందుకు ఈ సంస్థలకు నిధులు సమకూర్చనుంది గూగుల్ . దీని వాళ్ళ మరిన్ని సంస్థలకు ఊతం ఇచ్చినట్టవుతుంది. మొత్తం మీద ఇండియన్స్ కు భారీ అఫర్ యూట్యూబ్ ఇవ్వడం గ్రేట్ కదూ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి