సామజ వరగమనా..నిన్ను ఆపగలమా
మాటల మాంత్రికుడు, ప్రముఖ సినీ దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో..రైజింగ్ స్టార్ బన్నీ ..లవ్లీ హీరోయిన్ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న అల వైకుంఠపురంలో సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన సామజవరగమనా సాంగ్ తెలుగు సినిమా చరిత్రలో రికార్డు బ్రేక్ చేసింది. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో మొదటి పాటగా ఈ పాటను రిలీజ్ చేశారు. విడుదలైన కొద్దీ సేపటికే యూట్యూబ్లో భారీ ఎత్తున స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఆ పాట సంచలనాలు రేపుతుంది.
ఇప్పటి వరకు 41 మిలియన్ల వ్యూస్ ఈ పాట సొంతం చేసుకుంది. అలాగే 7 లక్షల లైక్స్ ను కూడా యూట్యూబ్ లో దక్కించుకుంది. అత్యధిక యూట్యూబ్ లైక్స్ ను దక్కించుకున్న తెలుగు పాటగా సామజవరగమనా నిలిచింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు. ‘అత్యధికులు లైక్ చేసిన తెలుగు పాట. మీ ప్రేమకు థ్యాంక్స్’ అని బన్ని ట్వీట్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ 90 శాతానికి పైగా పూర్తయ్యింది.
వచ్చే ఏడాది సంక్రాంతి పండగకు విడుదల చేయాలనీ నిర్మాతలు ప్లాన్ చేశారు. థమన్ అందించిన సంగీతం, పాటలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచేలా డైరెక్టర్ త్రివిక్రమ్ మెరుగులు అద్దుతున్నాడు. నివేదా పేతురాజ్, టబు, జయరామ్, తదితరులు మిగతా పాత్రలలో నటిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి