పోస్ట్ ప్రొడక్షన్ హబ్ లో ముంబై బెటర్ - నెట్ ఫ్లిక్స్
డిజిటల్ మీడియాలో వరల్డ్ వైడ్ గా దూసుకెళుతున్న నెట్ ఫ్లిక్స్ తాజాగా ఆసియాలో అతి పెద్ద మార్కెట్ కలిగిన భారత్ పై కన్నేసింది. ఇప్పటికే దీనికి కోట్లాది మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. వీడియో స్ట్రీమింగ్ లో నెట్ ఫ్లిక్స్ మిగతా వాటితో పోటీ పడుతూనే తన బిజ్ నెస్ ను విస్తరించే పనిలో పడ్డది. ఇందులో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ లో ముంబై ప్రాంతం అత్యంత అనువైన ప్రాంతమని ఈ అమెరికన్ కంపెనీ పేర్కొంది. ఆసియా ఖండంలో తమకు ఇంత మంచి సిటీ ఎక్కడా అగుపించలేదని పేర్కొంది. ఇటీవలే ఇండియాకు చెందిన పలువురిని రిక్రూట్ చేసుకుంది. ఇప్పటికే మిలియన్స్ కొద్దీ వీడియోలను ఇందులో పొందు పర్చింది.
అయితే కస్టమర్స్ తమకు నచ్చిన సీరియల్స్, మూవీస్ చూడాలంటే తప్పనిసరిగా ప్రతి నెలా 199 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ తో పాటు గూగుల్ వీడియో, అమెజాన్ ప్రోమో, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా డిజిటల్ మీడియా రంగంలోకి ఎంటర్ కాబోతున్నది. మరో వైపు వినోద రంగంలో టాప్ రేంజ్ లో ఉన్న స్టార్ టీవీ కూడా హాట్ స్టార్ ను ప్రవేశ పెట్టింది. దీనికి కూడా విపరీతమైన జనాదరణ ఉంటోంది. తాజాగా ఎంటర్ టైన్మెంట్ రంగంలో అతి పెద్ద బిజినెస్ కలిగి ఉన్నది బాలీవుడ్. దీంతో నెట్ ఫ్లిక్స్ దీనిపై కన్నేసింది. ఆన్ లైన్ షో స్ కు ఎక్కువ డిమాండ్ ఉండడంతో నెట్ ఫ్లిక్స్ కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్ టైం మెంట్ కంపెనీతో మూవీస్, షోస్ కోసం ఒప్పందం చేసుకుంది.
ఈ రెండు కంపెనీల మధ్య భారీ డీల్ జరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎంతకు డీల్ కుదిరిందన్నది వివరాలు రెండు కంపెనీలు వెల్లడించ లేదు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పరంగా చూస్తే బాలీవుడ్ బెటర్. ఎంతో కంటెంట్ ఉన్నది ఇక్కడ దానిపై మేము ద్రుష్టి పెట్టామని చెప్పారు నెట్ ఫ్లిక్స్ కంపెనీ ఇండియా డైరెక్టర్ విజయ్ వెంకట రామనాన్. అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నాం. తమ కంపెనీ భారీ బడ్జెట్ తో ఇప్పటికే సీరియల్స్ స్టార్ట్ చేసిందని చెప్పారు. ఒక్కో షో ఖర్చు దాదాపు 5 కోట్ల నుంచి 7 కోట్ల దాకా ఖర్చవుతోంది అని తెలిపారు విజయ్. అయితే ప్రతి సీరియల్ 10 ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. మొత్తం మీద జనానికి కావాల్సినంత జోష్ కలుగుతోందన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి