ఆర్టీసీ బంద్ సంపూర్ణం..స్పందించని ప్రభుత్వం
తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపు సక్సెస్ అయ్యింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా టిఎన్జీవోస్ , ఎన్జీవోస్ , ఉపాధ్యాయ, సచివాలయ, విద్యుత్, విద్యార్ధి సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు, సకల జనులు సమ్మెలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులు ఆయా ఆర్టీసీ బస్సు డిపోల ముందు ఆందోళన చేపట్టారు. పలువురు కార్మికులను పోలీసులు అరెస్టులు చేశారు. పోలీస్ స్టేషన్స్ కు తరలించారు.
వీరికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, ముకేశ్ గౌడ్, బీజీపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ , రామ్ చంద్రరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రామ్, సీపీఐ నేత తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి తో పాటు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు స్టూడెంట్స్ ను బలవంతంగా అరెస్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్ళ లేదు.
ప్రైవేట్ డైరెక్టర్లు, కండక్టర్లు రాకుండా అడ్డుకున్నారు. పలు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని పార్టీల జిల్లా నాయకులు, విద్యార్ధి నాయకులను తరలించారు. కేంద్ర సహాయ హోమ్ శాఖా మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇన్ని రోజులుగా కార్మికులు తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కారించాలని కోరుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని, కోర్టు మెట్టి కాయలు వేసినా తన బుద్ది మార్చుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ మొత్తం జరుగుతున్న సంఘటలనను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నామని చెప్పారు.
రేవంత్ రెడ్డి, లక్ష్మణ్, భట్టి విక్రమార్క , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గా రెడ్డి, తదితరులు కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కోర్టు చర్చలకు బేషరతుగా పిలవాలని హైకోర్టు ఆదేశించినా, నోటీసులు జారీ చేసినా ఇప్పటి దాకా సర్కారు స్పందించ లేదు. మరో వైపు ప్రభుత్వం మాత్రం కార్మికుల సమ్మె సక్సెస్ కాలేదని, బస్సులన్నీ తిరిగాయని పేర్కొంది. ఇదిలా ఉండగా అన్ని సంఘాలతో పాటు ఓలా, ఉబర్ , తదితర కంపెనీలకు చెందిన డ్రైవర్లు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలకడం విశేషం. కాగా ఆర్టీసి జెఎసి నేతలు సమ్మె సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కార్యాచరణను వెల్లడించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి