రాబోయే కాలం..టీవీల‌దే రాజ్యం..మొబైల్ టీవీల‌దే సామ్రాజ్యం

టెక్నాల‌జీలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా..రాబోయే కాల‌మంతా టెలివిజ‌న్, మొబైల్ టీవీలకే ఎక్కువ ప్ర‌యారిటీ ల‌భించ‌నుంది. టెలికాం రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు చోటు చేసుకోవ‌డం ..ప్ర‌తి ఒక్క‌రు మొబిలిటితో క‌నెక్టివిటీ క‌లిగి ఉండ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌మ్యూనికేష‌న్ కే పెద్ద‌పీట ద‌క్కుతోంది. ఫోన్ టీవీతో పాటు సాధార‌ణ టీవీకి మంచి భ‌విష్య‌త్ ఉందంటూ ప్రైస్ వాట‌ర్ హౌజ్ కూప‌ర్స్ అనే సంస్థ చేసిన స‌ర్వేలో వెల్ల‌డించింది. ఇండియాలో ఫోన్ టీవీ మార్కెట్ 2023 నాటికి మార్కెట్ ప‌రంగా మూడు రెట్లు పెరుగుతుంద‌ని..దాని విలువ అమాంతం 11 వేల 976 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీని విలువ‌ను గుర్తించిన మార్కెట్ వ‌ర్గాలు..ఫోన్ టీవీ ప్రొవైడ‌ర్లు కంటెంట్‌ను పెంచేందుకు కృషి చేస్తున్నారు.

అంద‌రికీ టెల్కో సేవ‌లు అందుబాటులో ఉండ‌డం, త‌క్కువ ధ‌ర‌కు డేటా ల‌భించ‌డంతో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫోన్ టీవీ ప్రొవైడ‌ర్స్ కు భార‌త్ ఒక బలీయ‌మైన మార్కెట్‌కు అవ‌కాశం ఉంద‌ని గుర్తించాయి. భ‌విష్య‌త్‌లోను కొత్త‌గా మార్పులు చోటు చేసుకున్నా..ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోగ‌లిగిన మాధ్య‌మం ఏదైనా ఉందంటే అది ఫోన్ టీవీ మాత్ర‌మేన‌ని సంస్థ పేర్కొంది. 24 గంట‌ల పాటు క‌నెక్టివిటిలోనే ఉండ‌డం కూడా మ‌రో అవ‌కాశంగా భావించ‌వ‌చ్చు. కోట్లాది మంది భార‌తీయులు మొబైల్స్ లేకుండా వుండ‌లేక పోతున్నారు. పొద్దుటి నుంచి అర్ధరాత్రి ప‌డుకునే దాకా ..అంతా ఫోన్ల‌లోనే జీవితం గ‌డిచి పోతోంది. ప్ర‌తి నిత్యం అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓవ‌ర్ ది టాప్ స‌ర్వీసుల్లో మూవీస్, ఒరిజిన‌ల్ షోస్ చూడందే నిద్ర పోవ‌డం లేఉద‌. దీంతో ఫోన్ టీవీ యాప్స్ కు విప‌రీత‌మైన డిమాండ్ ..క్రేజ్ ఉంటోంది.

మ‌రింత మంది యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఈ సంస్థ‌ల‌న్నీ పెద్ద ఎత్తున ఒరిజ‌న‌ల్  షోల‌ను రూపొందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ 16 ఒరిజ‌న‌ల్స్ చేప‌ట్ట‌గా, వీటిలో ఏడు షోలు ఇండియా మార్కెట్ ను చూసి త‌యారు చేసిన‌వే కావ‌డం కొస‌మెరుపు. మ‌రో ఫోన్ టీవీ ప్రొవైడ‌ర్ నెట్ ఫ్లిక్స్ ..దేశీయ మార్కెట్ కోసం తొమ్మిది ఒరిజిన‌ల్ షోల‌ను విడుద‌ల చేసేందుకు రెడీ అవుతోంది. వీటితో పాటు పోటీ ప‌డుతున్న హాట్ స్టార్ కూడా ఒరిజిన‌ల్ షోస్ రూపొందించేందుకు ప్లాన్ చేస్తోంది. గ‌త ఏడాదిలో ఏకంగా ఫోన్ టీవీ మార్కెట్ 64 శాతానికి పెరిగింది. అమెరికా లాంటి కంట్రీని ఇపుడు ఫోన్ టీవీ దెబ్బ కొడుతోంది. టీవీ మార్కెట్ గ‌ణ‌నీయంగా ప‌డి పోయింది. ఇదే క‌నుక జ‌రిగితే ఫోన్ టీవీల‌కే జ‌నాద‌ర‌ణ ల‌భించ‌డంతో టీవీ మార్కెట్‌పై ప్ర‌భావం చూపించ‌నుంది.

ఇక ప్ర‌క‌ట‌న‌ల ప‌రంగా చూస్తే..2023 నాటికి టాప్ మార్కెట్‌ల‌లో ఇది కూడా ఒక‌టిగా నిల‌వ‌నుంది. ఇత‌ర దేశాల‌తో ఇండియా పోటీ ప‌డనుంది. దీంతో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు కూడా పెరుగుతాయి. 11 శాతం గ్రోత్ రేట్ ఉంటుంద‌ని అంచ‌నా. టీటీ, ఇంట‌ర్నెట్ యాడ్స్, ఈ స్పోర్ట్స్‌, మ్యూజిక్ వ‌ల్ల ఎంట‌ర్ టైన్ మెంట్, మీడియా ఇండ‌స్ట్రీల మార్కెట్ విలువ 4 ల‌క్ష‌ల 50 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని అంచ‌నా. గ‌త ఏడాది 11 వేల కోట్లు దాటింది. వ‌చ్చే నాలుగేళ్ల‌లో 18 వేల కోట్ల‌కు చేరుకోవ‌చ్చు. మొత్తం మీద టాలెంట్ క‌లిగి వుంటే..డిజిట‌ల్ ,మీడియా టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంటే చాలు భారీగా ఆదాయం స‌మ‌కూర్చు కోవ‌చ్చు.

కామెంట్‌లు