నెలసరిపై అవగాహన కల్పిస్తున్న కమల్ నాయక్..!
ఈ మొత్తం ప్రక్రియలో, జీవన విధానంలో పునరుత్పత్తికి ప్రధాన కేంద్రం ఇదే. బాలికలు, యువతులు, మహిళలు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి నెలసరి ఆగి పోయే దాకా నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. ఇండ్లల్లో పనులు, వంట చేయడం దగ్గరి నుంచి ..ఉదయం నుంచి రాత్రి పడుకునేంత దాకా నానా రకాలుగా గొడ్డు చాకిరి చేస్తూనే ఉంటారు. మళ్లీ ఉద్యోగాలకు వెళ్లడం కూడా. దీంతో వారు శారీరకంగా , మానసికంగా త్వరగా అలసటకు లోనవుతున్నారు. చెప్పుకోలేని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కువ శాతం నాణ్యవంతమైన ప్యాడ్స్ వాడడం లేదని ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఇక తెలంగాణ, ఏపీలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. మహిళా స్వయం సహాయక సంఘాలు మహిళల కోసం ప్రత్యేకంగా ప్యాడ్స్ ఎలా వాడాలో అవగాహన కల్పిస్తున్నారు.
మరో వైపు అంగన్‌వాడి వర్కర్లు, ఆయాలు, వైద్య సిబ్బంది కూడా నెలసరి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నారు. ఐటీ రంగంలో వచ్చిన మార్పులు మహిళలకు ఎక్కడలేని ఉపాధి అవకాశాలను మోసుకొచ్చింది. దీంతో ఒకప్పుడు వంటింటికే పరిమితమైన వీరంతా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. భారీ, దిగ్గజ కంపెనీలకు సైతం ఛైర్మన్లుగా, సిఇఓలుగా , మేనేజింగ్ డైరెక్టర్లుగా, వ్యాపార వేత్తలుగా సక్సెస్ ఫుల్ బాటలో నడుస్తున్నారు. ఎన్ని విజయాలు సాధించినా నెల నెలా మాత్రం ఆ ఇబ్బంది తప్పదు. దీనినే గమనించాడు ఓ యువకుడు. అతడే హైదరాబాద్‌లో ఉంటున్న కమల్ నాయక్. మెన్సెస్ గురించి మాట్లాడాలంటే చాలా మంది జడుసుకుంటారు. అదేదో తప్పు అన్న భావనతో ఉంటారు. హెల్త్ పరంగా ప్రభావం చూపించే దీని గురించి అవగాహన లేక పోవడం వల్లనే రోగాల బారిన పడుతున్నారని గుర్తించారు.
ఇందు కోసం ఏకంగా బాలికలకు బ్రెడ్లు, ఇతర ఫుడ్ ఐటమ్స్‌తో పాటు నెలసరిపై అవగాహన కల్పిస్తున్నారు. వారిని చైతన్యవంతం చేస్తున్నారు. చైతన్యవంతం చేయడం సామాజిక బాధ్యతగా గుర్తించాడు. గుడ్ యూనివర్స్ పేరుతో స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేశాడు. దీని ద్వారానే ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా పాఠశాలలకు వెళ్లడం. అక్కడ ఆరోగ్య పరంగా అవగాహన కల్పిస్తున్నాడు. సుస్థిర అభివృద్ధి అనే అంశంపై యునైటెడ్ నేషన్స్ నుంచి ఫెల్లోగా ఈ ప్రాంతానికి వచ్చాడు కమల్ నాయక్ 2012లో. అప్పటి నుంచి నేటి దాకా పనిచేస్తూనే ఉన్నాడు. ఇతని స్వస్థలం ఒడిస్సా. పేదరికం దగ్గరుండి చూశాడు.
అక్కడ వుయ్ ఛేంజ్ యు అనే సంస్థలో చేరాడు. మద్యం, స్మోకింగ్ మాన్పించేందుకు కృషి చేశాడు. ఉస్మానియా యూనివర్శిటీలో సోషల్ వర్క్‌లో చదివేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడి పరిస్థితులను గమనించి నెలసరి గురించి అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టాడు. తెలంగాణ, ఏపీలలోని స్లమ్ ఏరియాలను ఎంచుకున్నాడు. ఒకప్పుడు అతడి గురించి ఆందోళన చెందిన వారే ఇపుడు సాదర స్వాగతం పలుకుతున్నారు. మార్పు ఎక్కడి నుంచో రాదు..అది మన నుంచే మొదలవుతుంది కదూ..కమల్ నాయక్‌ను చూస్తే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి