సానియా హల్ చల్..సోషల్ మీడియాలో వైరల్ ..!
ఇండియాలో ఎవరు ఎప్పుడు స్టార్స్ గా వెలుగొందుతారో ఎవ్వరూ చెప్పలేరు. మోస్ట్ ఫెవరబుల్ గా ఉంటూ అటు అభిమానులను ఇటు నెటిజన్లను ఆకట్టుకుంటున్న ప్లేయర్స్ లలో ఒకరు ఇండియన్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ అయితే మరొకరు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ఆమె మోడల్ గా, క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. ఇటీవల ఓ బాబుకు తల్లి కూడా అయ్యారు. అయినా ఆమె అందంలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా రోజు రోజుకు ఇంకా బ్యూటిఫుల్ గా తయారవుతూ ఫ్యాన్స్ ను మరింత విస్తు పోయేలా చేస్తోంది. అంతే కాదు సానియా మీర్జా మిగతా ఆటగాళ్ల కంటే సోషల్ మీడియాలో ముందంజలో ఉంటున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా, ఏ ప్లేస్ ను సందర్శించినా వెంటనే సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో క్షణాల్లోనే అవి వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో ప్రతి రోజు సానియా మీర్జా పోస్ట్ చేస్తున్నారు. లెక్కలేనంత మంది లైకులు, హాట్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలు పెట్టారు. వీటిని చూసిన నెటిజన్స్ ఔరా అంటూ విస్తు పోయారు. కొడుక్కి తల్లివైనా ఏమాత్రం అందం తగ్గలేదంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా తన చెల్లెలు ఆనం మీర్జాతో కలిసి పారిస్ వెళ్లారు. ఆ నగరంలోని వీధుల్లో విహరిస్తున్నారు. తన చెల్లి ఆనమ్ మీర్జా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆనమ్ మీర్జా బ్యాచిలర్ పార్టీని పారిస్‌లో ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో సానియా మీర్జా హైలెట్‌గా నిలిచారు. పారిస్ వీధుల్లో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా పోస్ట్ చేశారు. ప్రస్తుతం సానియా ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
అంతేకాకుండా ఆ ఫోటోలపై నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ‘సానియా ఆటకు, యాటిట్యూడ్‌కు పెద్ద ఫ్యాన్’, అంటూ నెటిజన్లు స్పందించారు. కాగా గతకొద్ది రోజుల కిందట తాను పెళ్లి చేసుకో బోతున్నట్లు ఆనమ్ మీర్జా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్‌ను ఆనమ్ వివాహం చేసుకోబోతోందని అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్నారు. దీంతో ఆనమ్‌కు కాబోయే భర్త అసదుద్దీనే అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే వీరిద్దరూ ఈ వార్తలపై ఇప్పటివరకూ స్పందించ లేదు. మొత్తం మీద ఆనం మీర్జా కంటే అక్క సానియానే టాప్ లో ఉండటం కొంత విస్తు పోయే అంశం. ఎంతైనా ఆట కంటే అందమే ఆనందం కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి