రేగిన దుమారం..తగ్గిన డైరెక్టర్..వాల్మీకి ఇక గద్దలకొండ గణేష్


సినిమా టైటిళ్ల విషయంలో వివాదాలు కొత్త కాదు. తెలుగు సినిమా రంగాన్ని ప్రతి సారి ఏదో ఒక సినిమాపై తమ మనో భావాలు దెబ్బ తింటున్నాయని ఆందోళనలు చేయడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం మామూలై పోయింది. తాజాగా డైనమిక్ డైరెక్టర్, రచయిత, భావుకుడు, ధైర్యం కలిగిన వ్యక్తి హరీష్ శంకర్ తీసిన వాల్మీకి పై పెద్ద దుమారం చెలరేగింది. అంతకు ముందు షాక్ తీశాడు. మిరపకాయ్ మూవీతో దుమ్ము రేపాడు. పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ సినిమా తీశాడు. పవన్ రేంజ్ ను మరింత పెంచాడు. ఒకే ఒక్క డైలాగ్ తెలుగు రాష్ట్రాలను ఊపేసింది అదే నాకో తిక్కుంది దానికో లెక్కుంది అని. తర్వాత బన్నీతో డీజే తీశాడు . అదే దువ్వాడ జగన్నాథం. గుడిలో బడిలో ఒడిలో అన్న పాటపై దుమారం చెలరేగింది. పొద్దస్తమానం పుస్తకాలతో కుస్తీ పడుతూ, నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తూ మాంచి కసితో ఉండే హరీష్ శంకర్ ఏది మాట్లాడినా ఓ కిక్ ఉంటుంది. 
అది చూసే వాడికి అర్థమవుతుంది. తానేమిటో తన పదాలకున్న పవర్ ఏమిటో. సినీ జనాలకు తానేమిటో రుచి చూపించాడు. అతడి సినిమాలలో ఏదో ఒకటి వివాదం చోటు చేసుకుంటూనే ఉన్నది. తాజాగా వరుణ్ తేజ్ తో వాల్మీకి పేరుతో సినిమా తీశాడు. టీజర్ కు హెవీ రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపుతో నిర్మాతలు, దర్శకుడు సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సమయంలో వాల్మీకి, బోయ సంఘాలు, నేతలు తీవ్ర అభ్యంతరం పెట్టారు. దీంతో హరీష్ శంకర్ దిగి రాక తప్పలేదు. వాల్మీకిని గద్దలకొండ గణేష్ గా మార్చుతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను 30 కోట్లు ఖర్చు చేసి తీశామని, తీరా ఇలా వివాదాలు చోటు చేసు కోవడం భాధ కు గురి చేసిందన్నారు డైరెక్టర్. ఎవరైతే తమ మనో భావాలు దెబ్బతిన్నాయని ఆందోళన చెందుతున్నారో, వారందరికీ చెబుతున్నా ఈ సినిమా ఎవ్వరినీ హర్ట్ చేయదు. ఇంకా వారు ఆరాధిస్తున్న వాల్మీకిని మరింత గొప్పగా చూపించామన్నారు. 

ఇన్ని సినిమాలు తీసినా ఎప్పుడూ ఫోన్ చేయని మా నాన్న గొప్ప టైటిల్ పెట్టావంటూ మెచ్చుకున్నారు. తీరా ఇలా రాద్ధాంతం చెలరేగుతుంది అనుకోలేదన్నారు. 200 టెక్నీషియన్స్ తో దాదాపు 7 నెలలకు పైగా కష్టపడి వాల్మీకి సినిమా తీశామన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమా తీసేది వేరొకరి మనోభావాలు దెబ్బ తీయాలని కాదన్నారు. ఎవ్వరైతే తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని భావిస్తున్నారో, ఆందోళనకు గురవుతున్నారో ముందు వాల్మీకి సినిమా చూడండని, చూశాకా మీ అభిప్రాయలు మార్చుకుంటారని అన్నారు హరీష్ శంకర్. వాల్మీకి మహర్షి గురించి ఎక్కడా తప్పుగా చూపించలేదన్నారు. బోయ సంఘం, వాల్మీకి సంఘాల వారు టైటిల్ లో తుపాకీ ఉందని, తీసి వేయమని కోరారు. అలాగే తొలగించడం జరిగిందన్నారు. మొదటిసారి నేను ఓడిపోయానని అనిపిస్తోంది. ఓ డైరెక్టర్ గా కాదు, ఓ రైటర్ గా కాదు..ఒక హైందవ సమాజానికి చెందిన వ్యక్తిగా వాల్మీకి మీద ఉన్న గౌరవాన్ని, ఒక మంచి విషయాన్నీ జనంలోకి తీసుకు వెళ్లడంలో ఓటమి చెందానని అనుకుంటున్నట్లు హరీష్ శంకర్ వాపోయారు. మొత్తం మీద హిట్ మీద కంటే కంటెంట్ మీద దృష్టి పెట్టే ఈ డైరెక్టర్ బాధను అర్థం చేసుకునే వాళ్ళు కావాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!