డిజిట‌ల్ పేమెంట్స్‌ల‌లో ఫోన్ పే ముందంజ‌..లావాదేవీల‌లో నెంబ‌ర్ వ‌న్ ..!

డిజిట‌ల్ పేమెంట్స్ విభాగంలో ఫోన్ పే లావాదేవీల ప‌రంగా కోట్లాది రూపాయ‌ల ఆదాయాన్ని పొందుతోంది. అమెరికాలోని రిటైల్ దిగ్గ‌జ కంపెనీ వాల్ మార్ట్‌కు డిజిట‌ల్ పేమెంట్ స‌ర్వీసె సంస్థ కాసుల‌ను కురిపించేలా చేస్తోంది. వాల్యూయేష‌న్‌లో ఈ కంపెనీ అనూహ్యంగా దూసుకెళుతోంది. ఇండియాలో అతి పెద్ద ఈ కామ‌ర్స్ కంపెనీగా ఉన్న ఫ్లిప్ కార్ట్‌ను వాల్‌మార్ట్ చేజిక్కించుకుంది. ఆ స‌మ‌యంలో స‌ద‌రు కంపెనీ ఫోన్ పే సంస్థ‌ను ప‌ట్టించు కోలేదు. ఫ్లిప్ కార్ట్‌లో ఆల్ రెడీ భాగంగా ఉన్న ఫోన్ పే ప్ర‌స్తుతం దేశంలోనే టాప్ స్టార్ట‌ప్‌ల‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. దీని వ్యాపారాలు కూడా ఊహించ‌ని రీతిలో పెరుగుతూ వ‌స్తున్నాయి. దీంతో అద‌నంగా వాల్ మార్ట్‌కు అనుకోని రీతిలో ప్ర‌యోజ‌నాలు చేకురుతున్నాయి. ఆదాయం అంత‌కంత‌కు పెరుగుతుండ‌డంతో ఫ్లిప్ కార్డ్ బోర్డు ..ప్ర‌త్యేకంగా స‌మావేశాన్ని నిర్వ‌హించింది.

త‌మ కంపెనీలో భాగ‌స్వామిగా ఉన్న ఫోన్ పే కోసం ప్ర‌త్యేకంగా ఫోన్ పే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మ‌రో కొత్త సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాక బ‌య‌టి నుంచి పెట్టుబ‌డిదారుల నుంచి 100 కోట్ల డాల‌ర్ల వ‌ర‌కు అంటే దాదాపు 6 వేల 858 కోట్ల రూపాయ‌ల దాకా సేక‌రించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఫోన్ పే విలువ 10 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు అంటే 68 వేల 580 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. వ‌చ్చే నెలలో ఫండింగ్ పూర్త‌వుతుంద‌ని తెలిపారు. ఫండింగ్ సేక‌రించే చ‌ర్చ‌లు ఇంకా కొలిక్కి రాలేదు. త్వ‌ర‌లో వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. వ‌చ్చే రెండు నెల‌ల్లో ఫండింగ్ పూర్త‌వుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని ఫ్లిప్ కార్ట్ వ్య‌క్తం చేసింది. ఇన్వెస్ట‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది కంపెనీ. వాల్ మార్ట్‌కు స్వంత‌మైన ఫ్లిప్ కార్ట్ దీనికి వాటాదారుగా ఉంది. ఈ విష‌య‌మై ఒక స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యాన్ని వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్‌లు ఇంకా ప్ర‌పంచానికి వెల్ల‌డించ‌లేదు.
 
ఆశావాదంతో ఉన్న పెట్టుబ‌డిదారులు అయితే గ్రోత్ ప‌రంగా బాగుంటుంద‌ని ఆలోచిస్తోంది. ఫోన్ పే నుంచి పాఠాలు నేర్చుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆప‌రేష‌న్స్ అమ‌లు చేయాల‌ని వాల్ మార్ట్ భావిస్తోంది. కొత్త గా నిధుల సేక‌ర‌ణ‌తో ఫోన్ పే వృద్ధినే ల‌క్ష్యంగా పెట్టుకుంది ఈ కంపెనీ. ఇక లావాదేవీల విష‌యానికి వ‌స్తే, దేశంలోనే లీడింగ్ డిజిట‌ల్ పేమెంట్స్ కంపెనీల్లో ముందంజ‌లో ఉంది. నాలుగు ఇంత‌ల కంటే మేర పెరిగింది. ఫోన్ పేను వాడుతూ దేశంలోని చాలా మంది వినియోగ‌దారులు త‌మ మ‌నీని వ్యాపారాల కోసం, ఇత‌రుల అవ‌స‌రాల నిమిత్తం బదిలీ చేస్తున్నారు. ఫోన్ పేను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేమ‌ని, రాబోయే రోజుల్లో ఈ కంపెనీకి మ‌రింత భ‌విష్య‌త్ ఉందంటూ స్ప‌ష్టం చేశారు. 14 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 15 వేల బిలియ‌న్ డాల‌ర్ల కు చేరుకోవ‌డం విశేషం. మ‌రో వైపు ఇండియాలో డిజిట‌ల్ పేమెంట్స్ ప‌రంగా చూస్తే 2023 నాటికి లక్ష కోట్ల డాల‌ర్ల‌కు చేరుకుంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాల అంచ‌నా. కాగా గూగుల్ పే, అమెజాన్ లాంటి కంపెనీల‌ను దాటి ముందుకు దూసుకెళుతోంది ఫోన్ పే. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!