డాల‌ర్స్ డ్రీమ‌ర్స్ కు యుఎస్ బంప‌ర్ బొనాంజా - గ్రీన్ కార్డుల ప‌రిమితి ఎత్తివేత బిల్లుకు ఆమోదం

నిన్న‌టి దాకా ఇండియాపై కారాలు మిరియాలు నూరుతూ క‌న్నెర్ర చేస్తూ వ‌చ్చిన ప్ర‌పంచ పెద్ద‌న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తాజాగా కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న ఎన్నికైన‌ప్ప‌టి నుంచి భార‌తీయుల‌కు న‌ష్టం క‌లిగించే రీతిలోనే వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. త‌మ దేశంలో ఇండియ‌న్స్ వుంటూ..త‌మ వారి అవ‌కాశాల‌ను దెబ్బ తీస్తున్నారంటూ చేసిన కామెంట్స్ ఇండియ‌న్స్‌ను కంటి మీద కునుకే లేకుండా చేశాయి. వీసా ల జారీ విష‌యంలో కూడా క‌ఠిన‌త‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. దీంతో అమెరికా అంటేనే జ‌డుసుకునే ప‌రిస్థితికి తీసుకు వ‌చ్చారు  యుఎస్ ప్రెసిడెంట్. తొలిసారిగా భార‌తీయుల‌కు మేలు చేసే దిశ‌గా పెద్ద‌సారు ఓ అడుగు ముందుకు వేశారు. అమెరికాలో శాశ్వ‌త నివాసానికి ప‌ర్మిష‌న్ ఇచ్చే వ‌ల‌స‌దారుల వీసాల‌పై దేశాల వారీగా ఉన్న ప‌రిమితిని ఎత్తివేసే బిల్లును అమెరికా ప్ర‌తినిధుల స‌భ ఆమోదించింది. 

దీంతో కోట్లాది మంది భార‌తీయులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా డాల‌ర్లు సంపాదించాల‌నే డ్రీమ‌ర్స్ కు ఇది ఓ శుభ‌వార్త‌. ఇండియన్స్ కు ఇక‌పై గ్రీన్ కార్డులు ఎక్కువ‌గా జారీ అయ్యే అవ‌కాశాలున్నాయి. విదేశీయులు గ్రీన్‌కార్డులు పొందాలంటే ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వేచి చూడాల్సి వ‌చ్చేది. ఇపుడా ప‌రిమితిని ఎత్తి వేయ‌డంతో ఇండియా, చైనా వంటి దేశాల నుంచి ఎక్కువ సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చే టెక్నిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌కు త్వ‌ర‌గా గ్రీన్ కార్డు వ‌చ్చేందుకు మార్గం ఏర్ప‌డింది. అమెరికా వెళ్లాల‌ని అనుకునే వారికి ఆ దేశం రెండు ర‌కాల ర‌కాలైన వీసాలు జారీ చేస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా , ప‌ర్య‌టించే వారి కోసం , అంతేకాకుండా అక్క‌డున్న త‌మ వారిని చూసే వారి కోసం ఇచ్చే వ‌న్నీ నాన్ - ఇమ్మిగ్రెంట్ వీసాలుగా ప‌రిగ‌ణిస్తూ జారీ చేస్తుంది. ఈ వీసాల‌కు కొంత మేర‌కే కాల‌ప‌రిమితి మాత్ర‌మే ఉంటుంది. 

ఇక అంద‌రికీ సుప‌రిచిత‌మైన మ‌రో పేరు ఏమిటంటే అదే హెచ్‌1బి వీసా వంటివి ఈ కోవ‌లోకి వ‌స్తాయి. ఇక రెండో ర‌కం ఇమ్మిగ్రెంట్ వీసాలు. అంటే వ‌ల‌స దారుల వీసాలు. అమెరికాలో శాశ్వ‌త నివాసానికి వీలు క‌ల్పించే వీసా ఇది. చాలా మంది ఇండియ‌న్స్ ఎక్కువ‌గా ప్రిఫ‌ర్ చేసేది యుఎస్‌నే. ఎందుకంటే అక్క‌డ ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌డ‌తార‌ని, ఎలాంటి వివ‌క్ష ఉండ‌ద‌న్న అభిప్రాయంతో ఉంటారు. ప్ర‌తిపాదిత బిల్లు ఆమోదం పొంద‌డంతో చాలా దేశాల వారి క‌ల‌లు నిజం చేసుకునేందుకు వీలు క‌లుగుతుంద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌రిమితిని ఎత్తి వేయ‌డంతో ..చైనా, ఫిలిప్పీన్స్, ఇండియా, త‌దిత‌ర దేశాల వాసుల‌కు కొంత మేర‌కు వెస‌లుబాటు క‌లిపించిన‌ట్ల‌యింది. ప్ర‌తినిధుల స‌భ ఆమోదం తెలిపినా ..చివ‌ర‌కు సెనెట్ కూడా ఆమోదం తెల‌పాల్సి ఉంటుంది. ఈ ఒక్క‌టి కూడా దాటితే అస‌లైన గండం గ‌డిచిన‌ట్టేన‌ని భావించ‌వ‌చ్చు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!