కియా క్యా కమాల్ కర్ దియా..!
కియా క్యా కమాల్ కర్ దియా..!
ఆటోమొబైల్ రంగంలో కియా మోటార్స్ దుమ్ము రేపుతోంది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా వాహనాల అమ్మకాలు కొంత మేరకు తగ్గినా ఇండియాలో మాత్రం కియా సంస్థ తయారు చేసిన కార్లకు భలే డిమాండ్ ఉంటోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపురం జిల్లాలో ఇటీవలే ప్రారంభించింది. ప్రస్తుతం మారుతి సుజుకి, టాటా , హ్యుండాయి , హొండా, వోక్స్ వాగన్ , ఇన్నోవా , తదితర వెహికల్స్ ను కొనుగోలు చేస్తూ వచ్చారు. వీటికి తోడుగా కియా కంపెనీ ఆకట్టుకునే డిజైన్స్, అద్భుతమైన ఫీచర్స్ , అందుబాటు ధరల్లో వాహనదారులకు, వెహికిల్స్ ప్రియులకు మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కియా స్లిటోస్ కాంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కారు ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనిని కొనుగోలు చేసేందుకు బారులు తీరారు.
దీని ధర 9 లక్షల 69 వేల రూపాయల నుండి 15 లక్షల రూపాయలకు పైగా ఉంది. ఈ కారును మొదటిసారిగా 2018 లో జరిగిన ఆటో షో లో ప్రదర్శించారు. ఇండియాలో కియా కంపెనీ 2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతానికి అనంతపురం ప్లాంట్ లో వీటిని తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన కార్లు విదేశాలకు త్వరలో ఎగుమతి కానున్నాయి. స్పెషల్ గా ఈ కారు పెట్రోల్ , డీజిల్ కలిపి మొత్తం 16 వేరియంట్లలో అందుబాటులో కి రానుంది. బీ ఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ఇంజన్ ను అమర్చారు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు ఐవీటీ టెక్నాలజీని అనుసంధానం చేశారు. కియా సెల్తోస్ కారులో భారీ ఎత్తున ఫీచర్స్ అందుబాటులోకి తీసుకు వచ్చారు .యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు ఉన్నాయి.
8 బోస్ సౌండ్ సిస్టమ్ స్పీకర్లు, మూడ్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ డ్రైవర్ సీట్, 360 కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు కోసం అత్యంత బలమైన ఉక్కును ఉపయోగించారు. ఈ కారులో యూవీవో కనెక్టివిటీ ద్వారా 37 స్మార్ట్ ఫీచర్లను అనుసంధానం చేసుకోవచ్చు .జియో ఫెన్సింగ్, రిమోట్ ఏసీ కంట్రోల్‌తో పాటు ఇంజిన్ స్టార్ట్, నేవిగేషన్, టైర్ ఒత్తిడిని పర్యవేక్షించే వ్యవస్థలు ఉన్నాయి. ఇక బురదలో, మంచులో వెళ్లేటప్పుడు ఉపయోగపడేలా ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ముందస్తు బుకింగ్ కు స్పందన రావడంతో కియో యాజమాన్యం ఆనందంలో ఉంది. ఎంతైనా కియా క్యా కమాల్ కర్ దియా అంటూ వాహన ప్రియులు అంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి