ముందుకు రాక పోతే మేము రెడీ


మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు వ్యూహంపై శివసేన గుంభనగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వాన్ని ఎవరూ ఏర్పాటు చేయలేక పోయిన పక్షంలో తమ వ్యూహం ఏమిటో అప్పుడు ప్రకటిస్తామని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని చెప్పారు. గవర్నర్ చొరవతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనే ఆశా భావంతో ఉన్నామని అన్నారు.

ఏకైక పెద్ద పార్టీని ఆహ్వానించడం సహజమే. కానీ, మెజారిటీ ఉందను కున్నప్పుడు ఫలితాలు వెలువడిన 24 గంటల్లోనే ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ఎందుకు, ముందుకు రాలేదో మాకు అర్ధం కావడం లేదు అని రౌత్ అన్నారు. శివసేన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ, గవర్నర్ వేసిన మొదటి అడుగుపై స్పష్టత వచ్చి, ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరూ, ముందుకు రాకుంటే అప్పుడు శివసేన తమ వ్యూహాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ఇరు పార్టీల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఉద్దవ్ థాక్రే బీజేపీపై , దేవేంద్రపై ఫైర్ అయ్యారు.

బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరిస్తే రెండవ పెద్ద కూటమిగా ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ను మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేత మిలింద్ డియోరా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో బీజేపీ పార్టీ శాశన సభా పక్ష నాయకుడు, మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటును చేయలేమన్నారు. తమకు అంత మెజారిటీ లేదని స్పష్టం చేశారు. మరాఠాలో ఏం జరగనుందో నన్న టెన్షన్ నెలకొంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!