షెఫాలీ పరుగులు..రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రికార్డును భారత మహిళా జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ బద్దలు గొట్టింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ మహిళల జట్టు 84 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ చెలరేగి ఆడింది. 49 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 73 పరుగులు చేసింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అర్ధ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కు రాలైన భారత క్రికెటర్‌గా షెఫాలీ రికార్డుల కెక్కింది. ఈ క్రమంలో రోహిత్‌శర్మ రికార్డు బద్దలైంది.
రోహిత్ 20 సంవత్సరాల 143 రోజుల వయసులో అర్ధ సెంచరీ సాధించగా, షెఫాలీ 15 సంవత్సరాల 285 రోజుల్లోనే ఆ ఘనత సాధించింది. యూఏఈకి చెందిన ఎగో డాజ్ 15 ఏళ్ల 267 రోజుల్లోనే అర్ధ సెంచరీ సాధించి ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా, షెఫాలీ వర్మ రెండో స్థానంలో నిలిచింది. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 185 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 73, స్మతి మంధాన 67, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 21 పరుగులు చేశారు.
అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 101 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆ జట్టులో షెమైన్ క్యాంప్ బెల్ చేసిన 33 పరుగులే అత్యధికం. మిగతా ఆటగాళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టుమని 15 పరుగులు చేయలేక పోయారు. షెఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. దీంతో వర్మ ఇప్పుడు వైరల్ గా మారారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి