బిగ్ బాస్ పై అభ్యంత‌రం..కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు

తెలుగు ఎంట‌ర్‌టైన్మెంట్ రంగంలో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న మా టీవీని ఏషియాలోనే టాప్ రేంజ్‌లో కొన‌సాగుతున్న స్టార్ గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో మేనేజ్‌మెంట్‌తో పాటు వివిధ విభాగాల‌లో, రంగాల‌లో కొత్త వారు చేరారు. ఓ వైపు సీరియ‌ల్స్, ఇత‌ర ప్రోగ్రామ్స్‌ను చేప‌డుతూ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో దూసుకెళుతోంది ఈ టీవీ. జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాంతో పాటు సీరియ‌ల్స్ తో త‌న రేటింగ్‌ను అలాగే కాపాడుకుంటూ వ‌స్తోంది రామోజీరావు నేతృత్వంలోని ఈటీవీ ఛాన‌ల్స్. ఇంకో వైపు స్వ‌రాభిషేకం నిరాటంకంగా కొన‌సాగుతోంది. ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష‌లాది మంది వీక్ష‌కుల మ‌న‌సు చూర‌గొంటోంది. దీంతో ఈ కార్య‌క్ర‌మానికి అద‌న‌పు హంగులు జోడించి ఆయా ప్రాంతాల‌లో ప్ర‌త్యేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ జ‌నానికి జోష్ క‌లుగ చేస్తోంది. 

మ‌రో వైపు ముద్ద మందారం, అత్త నా కోడ‌లా లాంటి డిఫ‌రెంట్ ప్రోగ్రామ్స్‌తో జీ తెలుగు టాప్ పొజిష‌న్‌లో చాలా కాలం పాటు కొన‌సాగింది. మా, ఈటీవీల నుండి పోటీ ఎదుర్కొంటోంది. కాగా స్టార్ గ్రూప్ ఎప్పుడైతే మా టీవీని చేజిక్కించుకుందో ..దాని రేంజ్ మ‌రింత పెరిగింది. నార్త్‌లో బిగ్ సక్సెస్ అయిన ఈ ప్రోగ్రామ్‌ను ఇపుడు మా టీవీలో కూడా ప్ర‌వేశ పెట్టింది. మొద‌ట దీనిని టాప్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు. ఎంద‌రో సెల‌బ్రెటీలు ఇందులో పాల్గొన్నారు. తెలుగులో రెండు సీజ‌న్లు విజ‌య‌వంతంగా బిగ్ బాస్ పూర్తి చేసుకుంది. మూడో సీజ‌న్లోకి అడుగు పెట్టాల‌ని చూస్తోంది. దీనికి అప్పుడే ప్లాన్ స్టార్ట్ చేసింది యాజ‌మాన్యం. అయితే ఈ బిగ్ బాస్ కార్య‌క్ర‌మంపై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిని ప్ర‌సారం చేయొద్దంటూ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ శ్వేతా రెడ్డితో పాటు న‌టి గాయ‌త్రి గుప్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

షో ప్రారంభం కాక ముందే వివాదాలు చుట్టు ముట్టాయి. నిర్వాహ‌కుల తీరు స‌క్ర‌మంగా లేద‌ని, అస‌భ్య‌క‌రంగా ఉందంటూ బాధితులు ఆరోపించారు. తాజాగా ఈ రియాల్టీ షోపై మ‌రో పిటిష‌న్ దాఖ‌లైంది. షో హోస్ట్ న‌టుడు నాగార్జున‌తో పాటు మ‌రో 10 మందిని ప్ర‌తివాదులుగా చేర‌స్తూ పిల్ దాఖ‌లైంది. షోలో అభ్యంత‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకునే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని, సినిమాల‌ను సెన్సార్ చేసిన విధంగానే ఈ షోను కూడా సెన్సార్ చేస్తూ టెలికాస్ట్ చేయాల‌ని పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా రాత్రి 11 గంట‌ల త‌ర్వాతే బిగ్ బాస్ -3 షోను ప్ర‌సారం చేయాల‌ని విన్న‌వించారు. ఇదిలా వుండ‌గా ..షో కోఆర్డినేష‌న్ టీం తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించింది. షోపై న‌మోదైన కేసుల‌ను కొట్టి వేయాల‌ని కోరుతూ క్వాష్ పిటిష‌న్ దాఖలు చేశారు. బంజారా హిల్స్‌, రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌ల‌లో న‌మోదైన వెంట‌నే కొట్టి వేయాలంటూ పిటిష‌న్‌లో పేర్కొంది. వీరి పిటిష‌న్‌ను అనుమ‌తి ఇవ్వొద్దంటూ జ‌ర్న‌లిస్ట్ శ్వేతారెడ్డి, న‌టి గాయ‌త్రి గుప్తాలు హైకోర్టు వ‌ద్ద నిర‌స‌న‌కు దిగారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!