షో ముగిసినా తగ్గని క్రేజ్

తెలుగు బుల్లి తెరమీద రికార్డు క్రియేట్ చేసిన స్టార్ మాటీవీలో టెలికాస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ముగిసినా ఇంకా దాని క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. వీరిలో అందరికంటే ఎక్కువగా రాహుల్, పునర్నవిల గురించే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇక రాహుల్ చేజారిన రాములో రాములా పాటను మరోసారి అతనితో పాడించాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాహుల్‌.. ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ హీరో కార్తీకేయ నటిస్తున్న 90 ఎమ్‌ఎల్‌ చిత్రంలో సింగిల్‌ సింగిల్‌ అనే పాటను పాడారు. దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణే లభిస్తోంది.

బిగ్‌బాస్‌ విజేత రాహుల్‌ వరుస ఇంటర్య్వూలు, పాటలతో బిజీ అయి పోయాడు. మరోవైపు బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్లు రీయూనియన్‌ పేరుతో  గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. హిమజ, మహేశ్‌, పునర్నవి, వరుణ్‌, వితిక, అలీ, అతని భార్య మసుమా హాజరయ్యారు. వరుణ్‌, వితికలు వరుస ఫొటో షూట్‌లతో ఏదో విధంగా అలరిస్తూనే ఉన్నారు.  పునర్నవి తన తదుపరి కెరీర్ ను సినిమాలపై దృష్టి సారించింది. మరోవైపు రాహుల్‌.. తనను గెలిపించిన అభిమానుల కోసం నగరంలో లైవ్‌ కన్సర్ట్‌ ఏర్పాటు చేయనున్నాడు. మొత్తం మీద బిగ్‌బాస్‌ గ్యాంగ్‌ మాత్రం రచ్చరచ్చ చేసింది.

రాహుల్‌, పునర్నవీలు ఎక్కడికి వెళ్లినా మీ మధ్య ఏముంది అంటూ క్వచ్చన్స్ వేస్తున్నారు. దీనికి పునర్నవి మాత్రం తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనంటూ కుండా బద్దలు కొట్టింది. అయినా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ టీవీ షోకు వీరిద్దరూ కలిసే వెళ్లారంటే బయట వీళ్లకున్న క్రేజ్‌ ఏపాటిదో అర్థమవుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఊహించని రీతిలో సక్సెస్ కావడం, స్టార్ టీవీకి ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతే కాకుండా మాటీవికి దేశ వ్యాప్తంగా ఈ ఒక్క ప్రోగ్రాం తో ఒక్కసారిగా పేరొచ్చింది. ఇదిలా ఉండగా షో ముగిసినా ఇంకా క్రేజ్ మాత్రం అలాగే ఉంది. 

కామెంట్‌లు