ఆట అద్భుతం..విజయం సంచలనం
గ్రీస్ యువ సంచలనం స్టెఫనోస్ సిట్సిపాస్ ప్రతిష్టాత్మక విజయంతో తన సత్తా చాటాడు. వరల్డ్ టాప్ ఆటగాళ్లు పాల్గొన్న ఏటీపీ ఫైనల్స్‌లో సిట్సిపాస్ విజేతగా నిలిచాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు ఇంకా ఒక్క గ్రాండ్ స్లామ్ టోర్నీ కూడా నెగ్గక పోయినా, దిగ్గజ ఆటగాళ్లను దాటి జెండా ఎగుర వేశాడు. ఆరో సీడ్ సిట్సి పాస్ 2 గంటల 35 నిమిషాల్లో 6–7, 6–2, 7–6 స్కోరుతో ఐదో సీడ్ డొమినిక్ థీమ్‌ను ఓడించాడు. 21 ఏళ్ల 3 నెలల వయసులో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన సిట్సిపాస్, 2001 తర్వాత అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫైనల్స్ చేరిన తొలి సీజన్‌లోనే సిట్సిపాస్ విజేతగా నిలవడం మరో చెప్పుకోదగ్గ విశేషం. ఫైనల్ పోరులో తొలి సెట్ సుదీర్ఘ ర్యాలీలతో సాగింది.
ఇద్దరి మధ్య సాగిన హోరాహోరీ పోరుతో సెట్ టై బ్రేక్‌కు చేరింది. అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌లతో దాడి చేసిన థీమ్ దూసుకు పోయాడు. 5–6 వద్ద సిట్సిపాస్ ఒక సెట్ పాయింట్‌ను కాపాడు కోగలిగినా, ఆ తర్వాత థీమ్ పదునైన సర్వీస్‌ను రిటర్న్ చేయలేక సెట్ కోల్పోయాడు. అయితే సిట్సిపాస్ రెండో సెట్‌లో పట్టుదలగా నిలబడ్డాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్న అనంతరం చక్కటి వాలీ, ఫోర్ హ్యాండ్ విన్నర్లతో ‘డబుల్ బ్రేక్’ సాధించాడు. ఈ ఒక్క సెట్‌లోనే అతను 10 విన్నర్లు కొట్టాడు. మూడో సెట్‌కు చేరిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పోటా పోటీగా తలపడ్డారు. ముందుగా 1–1తో స్కోరు సాగగా, బ్యాక్‌హ్యాండ్ విఫలం కావడంతో ఒత్తిడికి లోనైన థీమ్ 1–3తో వెనుక బడ్డాడు. వరుసగా మూడు గేమ్ లు గెలుచుకొని 4–3తో ముందంజలో నిలిచాడు.
కానీ స్కోరు మళ్లీ టై బ్రేక్‌కు చేరింది. ఇక్కడ కూడా 4–0తో సిట్సి పాస్ ఆధిక్యంలో నిలిచిన తర్వాత స్కోరు మళ్లీ 4–4తో సమమైంది. ఈ దశలో ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా సిట్సిపాస్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను ముగించాడు. తొలి సెట్ ఓడిన తర్వాత ఒక ఆటగాడు టైటిల్ సాధించడం 2005 తర్వాత ఇదే మొదటిసారి. సిట్సిపాస్‌కు 19 కోట్ల 8 లక్షలు ప్రైజ్ మనీతో పాటు 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ వ్యాప్తంగా తన ఆటతీరుతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి