చరిత్ర సృష్టించిన పెద్దల సభ


భారత సమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిది. అదే ఎప్పటికీ శాశ్వతం. వాజ్‌పేయి సెంటిమెంట్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. పెద్దల సభ రెండో సభ అయినప్పటికీ దానిని ఎప్పుడూ తక్కువ చేయ కూడదు. జాతి అభివృద్ధి కోసం  ఈ సభ పలికే మద్దతు అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు ప్రధానమంత్రి మోదీ. సభ చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపేందుకు, సభను స్తంభింప జేసేందుకు మధ్య సమతుల్యత పాటించాలని పార్టీలకు సూచించారు. 250వ సమావేశాలను పురస్కరించుకొని ప్రధాని సభలో మాట్లాడారు. రాజ్యసభలో అధికార ఎన్డీయేకి మెజార్టీ లేక పోవడంతో ఎన్నో కీలక బిల్లులు చట్ట రూపం దాల్చడం లేదు. వీటిపైనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. 

రాజ్యసభ సభ పేరుకే ద్వితీయ సభే కావొచ్చు. కానీ అదొక అద్వితీయ సభ అని వాజ్‌పేయి అన్న వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ఆయన సెంటిమెంట్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. పెద్దల సభ రెండో సభ అయినప్పటికీ దానినెప్పుడూ తక్కువ చేయ కూడదు. జాతి అభివృద్ధికి ఈ సభ పలికే మద్దతు అత్యంత కీలకం గొప్పదని కొనియాడారు. ఆర్టికల్‌ 370, 35(ఏ) వంటి బిల్లుల్ని ఆమోదించడంలో రాజ్యసభ కీలక పాత్ర పోషించింది. ఆ పాత్రను ఎవరూ మర్చి పోలేరని అన్నారు. జాతి ప్రయోజనాల విషయంలో రెండు సభలు ఐక్యతతో ముందుకు రావాలని మోదీ ఆకాంక్షించారు.

రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం లాంటి ముఖ్యమైన అంశాలలో రాజ్యసభ మరింత విస్తృతమైన పాత్ర పోషించాలని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు మరింత గౌరవ ప్రదమైన స్థానం కల్పించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా పెద్దల సభ వ్యవహరించడం లేదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత 67 ఏళ్లలో దేశం సామాజికంగా, ఆర్థికంగా రూపాంతరం చెందడంలో ఎగువ సభ ప్రధాన పాత్ర పోషించిందని, అయితే సభికులు జనం అంచనాలను అందుకోలేదని అన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ఎన్సీపీ, బీజేడీ పార్టీల అభ్యర్థులపై ప్రశంసల వర్షం కురిపించారు.  

కామెంట్‌లు