బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ - ఏటీఎంలలో డబ్బులుండక పోతే ఫైన్ - ఖాతాదారులకు ఊరట .!
కేంద్ర ప్రభుత్వంలో కొలువు తీరిన కమల దళపతి నరేంద్ర దామోదరదాస్ మోదీజీ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని తప్పించారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు. ఆర్బీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ఎట్టి పరిస్థితుల్లోను ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించంది. దీంతో భారత ప్రభుత్వానికి, దేశానికి, జాతి మొత్తానికి కస్టోడియన్‌గా ఉన్న ఆర్బీఐ అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో బ్యాంకుల ఎడా పెడా చార్జీల మోత నుంచి కొంత ఉపశమనం లభించినట్లయింది.
ఉన్నట్టుండి అర్ధరాత్రి నోట్ల రద్దు ప్రకటన చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా ఖాతాదారులు, ప్రజలు, రైతులు, వ్యాపారులు, దినసరి కూలీలు, ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు, కిరాణాకొ్ట్టుదారులు, స్టూడెంట్స్, ఇలా ప్రతి ఒక్కరు డబ్బులు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. రోజుల తరబడి ఏటీఎంల దగ్గర, బ్యాంకుల వద్ద నిరీక్షించారు. వారిపై పోలీసుల ప్రతాపం చూపించారు. లాఠీఛార్జీలు జరపడంతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. బ్యాంకులలో భద్రంగా దాచుకున్న డబ్బులను రాత్రికి రాత్రే తీసేసుకున్నారు. దీంతో ఒకానొక దశలో ఆర్థిక అత్యయిక ( ఎమర్జెన్సీ) పరిస్థితిని విధించే పరిస్థితికి వచ్చింది. దీంతో కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించి..నగదు నిల్వలు బ్యాంకులలో ఉంచేలా చేసింది. నోట్ల మార్పిడి పెద్ద ఎత్తున జరిగింది. ఏ ట్రాన్సాక్షన్‌కు లెక్కా పత్రం అంటూ లేకుండా పోయింది.
ఖాతాదారుల సేవల కోసమే ఉన్నామంటూ ప్రకటించే బ్యాంకులు పూర్తిగా బాధ్యతలను విస్మరించాయి. ఆనాటి నుంచి నేటి దాకా ఏటీఎంలు నో మనీ అంటూ దర్శనమిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు ఇపుడు పనుల బాటను విస్మరించి బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయినా బ్యాంకుల తీరు మారలేదు. ఆర్బీఐ ఎప్పటిలాగానే వ్యవహరిస్తోంది. అధికారుల పనితీరు అలాగే వుంది. రుణాలు అప్పనంగా ఇచ్చుకుంటూ వెళుతున్న బ్యాంకులు నిరర్ధక ఆస్తులను పెంచుకుంటూ పోతున్నాయి. కానీ కష్టపడిన డబ్బులు దాచుకున్న వారి పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రెండోసారి పవర్‌లోకి వచ్చిన మోదీ దెబ్బకు ఆర్బీఐలో కదలిక వచ్చింది.
ఇందులో భాగంగానే ..ఏటీఎంలు నగదు లేకుండా ఖాళీగా వుంటే బ్యాంకులపై భారీగా జరిమానా విధించేందుకు ఆర్బీఐ సిద్ధమవుతోంది. నగదు కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం ఈసుకుంటున్నట్లు సమాచారం. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఏం కేంద్రాలు గత కొద్ది రోజులుగా గంటల కొద్దీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో నగదు కోసం వినియోగదారులు.. బ్యాంకుల్లో బారులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఏటీఎంలలో ఎంత మొత్తం నగదు ఉందనేది తెలిసే విధంగా సెన్సార్లున్నాయి. ఖాతాదారులు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్దకు వెళ్లి నగదు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది. దీంతో వీరి వద్ద నుంచి నగదు తీసుకున్నందుకు చార్జీలను చెల్లించాల్సి వస్తోంది.
సెప్టెంబరు చివరి నాటికల్లా ఏటీఏం కేంద్రాల్లో భద్రతను పెంచాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. విమానాశ్రయాల వంటి అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతాల్లో ఉన్న ఏటీఏంలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోని వాటికి సెక్యూరిటీ కల్పంచాలని సూచించింది. 2016లో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కమిటీ ఆన్ కరెన్సీ మూవ్‌మెంట్ సూచించిన సిఫారసులకు అనుగుణంగా బ్యాంకులకు ఈ ఆదేశాలను జారీ చేసింది. సీసీటీవీ కవరేజీని పెంచటం సహా రాష్ట్ర, కేంద్ర సెక్యూరిటీ సిబ్బందితో ఏటీఏం కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి