చైనా హోటల్స్ మార్కెట్‌ను శాసిస్తున్న ఓయో - ఇండియన్ యువకుడి ఘనత
ఓయో కంపెనీని ఏ ముహూర్తంలో ప్రారంభించాడో రితీష్ అగర్వాల్ కానీ అతడి పంట పండుతోంది. ఏకంగా ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్స్ యాజమాన్యాలు దిమ్మ తిరిగేలా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోయాడు. ఒక్క ఐడియా ఇవాళ కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడించేలా చేస్తోంది. ఇది అరుదైన రికార్డుగా నమోదైంది. చైనా అంటేనే డ్రాగన్ గా పేర్కొంటారు. చాలా కంపెనీలు అక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించాలంటే నానా తిప్పలు పడుతుంటాయి. ముఖ్యంగా అమెరికన్ కంపెనీలకు చైనా చుక్కలు చూపిస్తోంది. ముప్పు తిప్పలు పెడుతోంది.
అలాంటి దుర్భేద్యమైన చైనా హోటల్స్ చైన్ మార్కెట్‌ను భారత్ కు చెందిన యువకుడు రితీష్ ఏలుతున్నాడు. ఇది ఓ రకంగా షాకింగ్ న్యూసే. ఇప్పటి దాకా తనకంటూ ఎదురే లేదని భావించిన దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, పోలారిస్ లాంటివన్నీ తమ కార్యకలాపాలను చైనాలోనే నిర్వహిస్తున్నాయి. లేకపోతే డోంట్ కేర్ అంటోంది చైనా సర్కార్. ప్రపంచంలో ఎక్కడైనా మీ ఆధిపత్యం చెల్లుబాటు అవుతుందేమో కానీ..ఇక్కడ బతకాలంటే మాత్రం మా నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
దీంతో దిగ్గజ కంపెనీలన్నీ దిగిరాక తప్పడం లేదు. కానీ ఇండియన్ ఓయో కంపెనీ మాత్రం రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. చైనా హోటల్స్‌ను క్యాపర్చ్ చేసే పనిలో పడింది. ఇది నమ్మశక్యం కాని నిజం. గత ఏడాది చైనాలో 10,000 వేల హోటల్స్ తో ఎంఓయు చేసుకుంది. దాదాపు 4 లక్షల 50 వేలకు పైగా రూమ్స్ ను అద్దెకు ఇస్తోంది. ఇది కూడా చైనా మార్కెట్ నిపుణులను ఆశ్చర్యానికి లోను చేసింది. దిగ్గజ కంపెనీలన్నీ చైనా దెబ్బకు లబోదిబోమని అంటుండగా ..రితీష్ అగర్వాల్ మాత్రం హాయిగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ఏకంగా తనకు నచ్చినట్టు బిజినెస్ రంగాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాడు. అందరూ తేలిగ్గా తీసుకున్న ఈ కుర్రాడు ఇపుడు ప్రపంచంలోనే హోటల్స్ చైన్ రంగంలో నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్నాడు. రేపో మాపో నెంబర్ వన్ స్థానానికి వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ దమ్ము ఈ యువకుడికి వుంది కనుక. మిగతా కంపెనీలకు సాధ్యం కాని దానిని మీరు ఎట్లా చైనాలో సక్సెస్ ఫుల్ ఆంట్రప్రెన్యూనర్‌గా ఎదిగారని అడిగితే ..అద్భుతమైన సమాధానం ఇచ్చారు..ఓయో సిఇఓ. ఏముంది..
మీరంతా మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. నేను మాత్రం వారితో చెలిమిని మాత్రమే కోరుకున్నా. నాకు భాష, మతం, దేశం అడ్డు రాలేదు. నియమ నిబంధనలకు లోబడే నా వ్యాపారాన్ని విస్తరించా. ఇందులో వింతేముంది అంటూ రితీష్ అగర్వాల్ ప్రశ్నించారు. 2013 సంవత్సరంలో చైనాకు చెందిన సాఫ్ట్ బ్యాంక్ కంపెనీ హోటల్స్ పరిశ్రమ దాని అవకాశాలను గుర్తించింది. ఇదే ఐడియాను ఓయో వర్కవుట్ చేసింది చైనాలో. ఇండియాలోనే కష్టమనుకుంటే ఏకంగా మనోడు అక్కడ మన జెండాను రెప రెపలాడేలా చేస్తున్నాడు. హ్యాట్పాఫ్ రితీష్ అండ్ ఓయో.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి