కృష్ణం వందే జగత్గురుం..!
మహోన్నతమైన భారత జాతిలో మానవత్వపు పరిమళాలు పూయించే పనిలో ఎందరో స్వాములు ..పీఠాధిపతులు ..గురువులు ..ఆచార్యులు తమకు తోచిన రీతిలో ..తమ తమ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. వేదాలు ..ఇతిహాసాలు ..పురాణాలు ..గీతోపదేశాలు చేసుకుంటూ మనుషుల్లో మాయమై పోతున్న భక్తిని ..తత్వాన్ని బోధిస్తున్నారు . ఇందులో దక్షిణ ..ఉత్తర భారతదేశంలోని మఠాధిపతులు ఎక్కువగా శ్రమిస్తున్నారు .
ఇదే సమయంలో విలువైన జీవితాలను త్యాగం చేస్తూ జాతి జీవన వికాసంలో సమిధలైన స్వామీజీలు ఎందరో . ఒక్కొక్కరిది ఒక్కో శైలి ..ఒక్కో మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక లోకాన్ని మరింత పరిపుష్టం చేస్తున్నారు . అలాంటి వారిలో శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఒకరు . ఆయన భగవత్ గీతను బోధిస్తున్నారు . శ్రీ కృష్ణుడి తత్వాన్ని ..బోధనలను నేటి కాలానికి ఆపాదిస్తూనే మరో వైపు యజ్ఞ యాగాదులను దేశ వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
కొందరు స్వాములు రాజకీయ నాయకులతో ..అధికారాన్ని తమ గుప్పిట్లో ఉంచు కోవాలని ..ఎప్పుడూ ప్రచారంలో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు . శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ మాత్రం ఎలాంటి ప్రచారాన్ని కోరుకోరు . తాము చేస్తున్న ఈ బృహత్ కార్యక్రమం ప్రజల కోసం . ఈ ప్రపంచం విభిన్న జాతులు ..మతాలు ..కులాలు ..వర్గాలతో నిండి పోయింది . దీనిని బాగు చేయాలంటే ఎంతో మిషినరీ కావాలి. ఇందుకోసం గీత ఒక్కటే మార్గం అంటారు.

కొందరు స్వాములు రాజకీయ నాయకులతో ..అధికారాన్ని తమ గుప్పిట్లో ఉంచు కోవాలని ..ఎప్పుడూ ప్రచారంలో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు . శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ మాత్రం ఎలాంటి ప్రచారాన్ని కోరుకోరు . తాము చేస్తున్న ఈ బృహత్ కార్యక్రమం ప్రజల కోసం . ఈ ప్రపంచం విభిన్న జాతులు ..మతాలు ..కులాలు ..వర్గాలతో నిండి పోయింది . దీనిని బాగు చేయాలంటే ఎంతో మిషినరీ కావాలి అంటారు శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ.మనుషుల్ని ప్రేమించే గుణం కోల్పోవటమే ఈ దుర్గుణాలకు మూలం. జీవితపు సారాన్నిఇంత గొప్పగా బోధించిన ఘనత ఒక్క శ్రీకృష్ణుడిదే అంటారు . అన్నిటికి మూలం గీతోపదేశం ..దానిని క్రమం తప్పకుండా ఆచరిస్తే సకల అరిష్టాలు నుండి ..దరిద్రం నుండి ..సమస్యల నుండి సులభంగా గట్టెక్కవచ్చు అంటారు స్వామీజీ . లేని దాని గురించి ఆలోచించడం వల్ల యెనలేని దుఃఖం కలుగుతుంది . అకారణంగా ద్వేషించడం అదేపనిగా మన మనసులోకి చేరిపోతుంది . ఈ విలువైన శరీరం ఆత్మను వదిలేసి సంతృప్తి ఇవ్వని వస్తువుల వెంట పరుగులు తీస్తుంది . ఇలాంటి వన్నీ మనల్ని ప్రేమించుకోలేని మనుషులుగా మార్చేస్తుంది అంటారు.
పని చేయకుండా ఫలితాన్ని ఎవ్వరూ పొందలేరు ..నీలోను నీతోటి వారిలోను ప్రవహించే ఆత్మ అంతా ఒక్కటే ..కేవలం నీ ఆలోచనలే నిన్ను వేరు చేస్తున్నాయి . అదే నేటి దుఃఖానికి ..ద్వేషానికి కారణం అంటారు స్వామిజీ. ఉపనిషత్ లోని సారాన్ని ..గీత లోని మాధుర్యాన్ని ఆయన హృద్యంగా ప్రవచిస్తారు . భాగవతంపై ఆయన అనర్గళంగా మాట్లాడుతారు . భక్తుల్లో ప్రేమ తత్వాన్ని ..కృష్ణ తత్వాన్ని మిళితం చేసి ఉపదేశిస్తారు.
స్వామిజీ హిమాలయాలు పర్యటించారు . ఎందరో ఆచార్యులు ..గురువుల్ని కలిశారు . ఆక్కడ విశ్వశాంతి కోసం చేయాల్సిన కార్యక్రమాలను స్వామీజీ రూపొందించారు . ఇదొక నిరంతర ప్రక్రియ . యాగం వల్ల యోగం కలుగుతుంది . యజ్ఞం వల్ల మనసుతో పాటు పరిసరాలు సైతం పరిశుభ్రమవుతాయి . అక్కడంతా మనుషులు పచ్చని ప్రకృతితో లీనమై పోతారు . గాలి ..నీరు ..ప్రకృతి ..మనసు ..శరీరం ఒకే స్థాయిలోకి వస్తాయి . అప్పుడు మానవ జన్మ ఎంత గొప్పదో అర్థమవుతుంది . మన ధర్మం ఏమిటో మనకు బోధ పడుతుంది అంటారు స్వాముల వారు .
స్వామిజీ లెక్కలేనన్ని ప్రాంతాలు ..స్థలాలు ప్రయాణం చేసారు . అంతటా విశ్వశాంతి స్మరణే ఆయనది . అందుకే ఆయన ఎక్కడున్నా సరే గీతోపదేశం చేస్తారు . అంతే కాదు యాగం ఏర్పాటు చేసుకోండి అని సెలవిస్తారు .
ఎలాంటి భేషజాలకు లోనుకాకుండా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ..యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ లోక హితమే తన మతంగా సాగిపోతున్న శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ధన్యుడు. ఆయన చేస్తున్న ప్రయత్నానికి భక్తులు సహకారం అందించాలి . అదే ఆయనకు తోడ్పాటు ..సమాజానికి మేలు కూడా ..కాదంటారా..!

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి