భళారే..అయ్యారే..అయ్యర్..కోహ్లీ కితాబు..!

కష్టాల్లో ఉన్నప్పుడు గోడలా నిల్చున్న వాడే నిజమైన హీరో. యుద్ధం లో కానీ, ఏ ఆటలో కానీ విజయ తీరాలకు తీసుకు వెళ్లే వారినే అభిమానులు ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటారు. అలాంటి వారిలో టీమిండియాలో మహమ్మద్ అజారుద్దీన్ , రాహుల్ ద్రవిడ్ లాంటి ఆటగాళ్లు ఎందరో తమ ప్రతిభా పాటవాలతో గట్టెక్కించారు. మరిచి పోలేని విజయాలు అందించారు. భారత జట్టు ప్రపంచ కప్ హాట్ ఫెవరెట్ గా ఉన్నా సెమీ ఫైనల్ లో ఒడి పోయింది . దీంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కోహ్లీ సారధ్య బాధ్యతలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆటగాడిగా రాణించినా జట్టుకు విజయాలు అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాడనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.

ఈ సమయంలో పలువురు సీనియర్లు సైతం అతడిని తప్పు పట్టారు. ధోని క్రీజ్ లో ఉన్నప్పటికీ సరిగ్గా ఆడలేదంటూ ఫ్యాన్స్ మంది పడ్డారు. ఈ సమయంలో బీసీసీఐ ఎంపిక కమిటీ తీరుపై దేశమంతటా ఆగ్రహం వ్యక్తమైంది . జట్టు ఎంపికలో పారదర్శకత పాటించ లేదని , జట్టు ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ఆటను ప్రదర్శించ లేదని మంది పడ్డారు . జట్టు ఆడే సమయంలో నాలుగో ప్లేస్ అతి ముఖ్యమైనది. ఓపెనర్లు ఫెయిల్ అవుతే జట్టును ఆదు కోవడంతో పాటు ముందుండి నడిపించే భాద్యత ఈ స్థానంలో మైదానంలోకి వచ్చే ప్లేయర్ పై ఉంటుంది. గత కొంత కాలంగా టీమిండియా నాలుగో స్థానంలో కుదురుకుని ..పరుగులు సాధించే బ్యాట్స్ మెన్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది.

అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో టీమిండియా గత కొన్నేళ్లుగా ఈ ప్లేస్ ను భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషిస్తోంది . తాజాగా బీసీసీఐ శ్రేయాస్ అయ్యర్ ను మరోసారి జట్టు కోసం ..విండీస్ టూర్ కోసం ఎంపిక చేసింది . అక్కడి పర్యటనలో అయ్యర్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. కోహ్లీకి వెన్ను దన్నుగా నిలిచాడు. దీంతో భారత జట్టు వన్డే సిరీస్ చేజిక్కించుకుంది. చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ ఈ క్రికెటర్ పై భారీగా నమ్మకం పెట్టుకున్నాడు. ఇటీవల మాజీ సారధి గవాస్కర్ సైతం విమర్శలు చేశాడు . కోహ్లీ , కోచ్ లు మాత్రం శ్రేయస్ పైనే నమ్మకం ఉంచారు . దీంతో వారి నమ్మకాన్ని నిలబెట్టాడు అయ్యర్. పూర్తి ఫామ్ మీదున్న ఈ ఆటగాడు మరికొన్ని మ్యాచ్ లు ఆడితే కానీ తన స్టామినా ఏమిటో తెలుస్తుంది. అయితే జట్టు సారథి కోహ్లీ మాత్రం శ్రేయస్ అయ్యర్ గేమ్ చేంజర్ అంటూ కితాబు ఇవ్వడం విశేషం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!