వారెవ్వా..వివో
స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకునేలా మొబైల్ కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ను తయారు చేస్తున్నాయి. అంతే కాకుండా అటు ఆఫ్ లైన్ లో ఇటు ఆన్ లైన్ లో ఉండేలా ఎప్పటికప్పుడు చూస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఒక రకంగా కొనుగోలుదారులకు పంట పండుతోంది. ఇప్పటికే ఇంటర్ నేషనల్ మొబైల్స్ మార్కెట్ లో అత్యధిక వాటాను చైనా మొబైల్ తయారీ కంపెనీలే చేజిక్కించుకున్నాయి. తాజాగా షావోమి కంపెనీ కొట్టిన దెబ్బకు దిగ్గజ మొబైల్ కంపెనీలు యాపిల్, శాంసంగ్ లు లబోదిబోమంటున్నాయి. రోజుకో వేరియంట్ తో, అందరికీ అందుబాటు ధరల్లో మొబైల్స్ ను లాంచ్ చేసుకుంటూ పోతోంది ఈ కంపెనీ.
ఇటీవలే రిలీజ్ చేసిన షావోమి - 8 మొబైల్ ఇండియాలో రికార్డు స్థాయిలో అమ్ముడు పోతోంది. కేవలం 10 వేల రూపాయల లోపు ఉండే ఈ ఫోన్ లో లెక్కలేనన్ని ఫీచర్స్ ఉన్నాయి. దీంతో మార్కెట్ లో నో స్టాక్ అన్న బోర్డు కనిపిస్తోంది. ఇప్పటికే 11 లక్షలకు పైగా మొబైల్స్ ను అమ్మింది షావో మీ. ఇక చైనాకు చెందిన మరో కంపెనీ వివో కూడా తన మార్కెట్ వాటాను పెంచుకునే పనిలో పడ్డది. తాజాగా వీవో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. తన వి సీరిస్‌లో భాగంగా వివో వి 17 స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది, క్వాడ్ రియల్ కెమెరా, సూపర్ అమోలెడ్ స్క్రీన్ ఐవ్యూ డిస్‌ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ రేటును 22,990 గా నిర్ణయించింది.
వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, టాటాక్లిక్, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టోర్లతోపాటు అన్ని రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంచింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ సౌకర‍్యం అందించనుంది. అలాగే సులభ వాయిదాల ద్వారా కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కారణంగా ఇంటెన్సివ్‌గా రోజంతా వాడినా తమ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లో చార్జింగ్ సమస్య వుండదని వివో ప్రకటించింది. అలాగే తక్కువ లైట్లో కూడా మెరుగైన ఫోటోగ్రఫీ కోసం వెనుక కెమెరాలో సూపర్ నైట్ కెమెరాను అమర్చినట్టు తెలిపింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి