హస్తానికి రెవెన్యూ..ఎన్సీపీకి హోమ్

మహారాష్ట్రలో కొలువు తీరిన సంకీర్ణ సర్కార్ పాలనను గాడిలో పెట్టే పనిలో నిమగ్నమైంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడి కూటమి ప్రభుత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి రెవెన్యూ, ఎన్సీపీకి హోం శాఖలు కేటాయించేలా అడుగులు పడుతున్నట్లు సమాచారం. దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మహా వికాస్‌ ఆఘాడి కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ శాఖలు కేటాయించాలనే దానిపై ఒక స్పష్టత రాక పోవడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతోందని తెలుస్తోంది. దీంతో నాగ్‌పూర్‌లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కేవలం ఐదు రోజులపాటు సాగే ఈ సమావేశాలు పూర్తి కాగానే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

అందులో శివసేనకు నగరాభివృద్ధి శాఖ, ఎన్సీపీకి హోం శాఖ, కాంగ్రెస్‌కు రెవెన్యూ శాఖ కట్టబెట్టే సూచనలున్నాయి. మహా వికాస్‌ ఆఘాడి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే కొనసాగుతున్నారు. కాగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పక్షం రోజులు కావస్తోంది. ఆ సమయంలో ఉద్ధవ్‌తో పాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, ఇంత వరకు వారికి శాఖలు కేటాయించ కపోవడమే గాకుండా మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు. మంత్రివర్గ విస్తరణకు శివసేన, ఎన్సీపీ జాబితా సిద్ధంగా ఉంది. కాని కాంగ్రెస్‌ నిర్ణయం మాత్రం ఢిల్లీలో అధిష్టానం ద్వారా జరుగుతుంది. దీంతో విస్తరణలో జాప్యం జరుగుతోంది.

మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో వివిధ శాఖలతో పోలిస్తే నగరాభివృద్ధి, రెవెన్యు, హోం శాఖలకు ప్రాధాన్యత ఉంది. దీంతో ఈ మూడు శాఖలను మూడు పార్టీలకు కేటాయించాలని నిర్ణయించినట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రి వర్గ విస్తరణ చేయాలని కొందరు నేతలు పట్టుబడుతున్నారు. మంత్రుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరగా శాఖల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తి  చేసే పనిలో పెద్దది శివసేన. దీంతో ఎవరికి, ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై అటు ఆయా పార్టీ వర్గాల్లో ఇటు ప్రజల్లో టెన్షన్ నెలకొంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!