చేదెక్కిన..చక్కెర
ఒక్కోసారి సీన్ రివర్స్ అవుతుంది. ఆటు పోట్లు..ఒడిదుడుకులు..లాభనష్టాలు బిజినెస్ లో మామూలే. ప్రస్తుతం చక్కెర విషయంలో ఇదే రిపీట్ అవుతోంది. వినియోగం తగ్గడం..ఉత్పత్తి భారీగా పెరగడంతో చక్కెర నిల్వలు ఎక్కడికక్కడ పేరుకు పోతున్నాయి. చక్కెర రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా చక్కెర నిల్వలు పేరుకు పోయాయి. ప్రకృతి కూడా ఈసారి కన్నెర్ర చేసింది. దీంతో ఆరుగాలం కష్టించి సాగు చేసిన చక్కెర పంట పూర్తిగా పాడై పోయింది.
ఇదిలా ఉండగా పంట విషయంలో ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు రైతులను ఆదు కోవడం విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఇదే సమయంలో పంటకు నష్టం వాటిల్లడంతో దిగుబడి తగ్గింది. ఇండియా నుంచి పంచదార ఎగుమతులు గత సీజన్లో 44 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. కాకపోతే ఎగుమతి ప్రోత్సాహకాల తాలూకు బకాయిలు ఏడాదిగా నిలిచి పోయాయి. దీంతో ఈ ఏడాది ఎగుమతులపై కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. రికార్డు స్థాయిలో 332 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయింది. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలలో ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉంటోంది.
దేశంలో చాలా చోట్ల కంపెనీలు తమ ఫ్యాక్టరీలను ఒకదాని వెంట ఒకటి మూసి వేస్తున్నాయి. గతేడాది ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంచదార ఫ్యాక్టరీలను మూసి వేశారు. ప్రస్తుతం మరికొన్ని కంపెనీలు మూసి వేసేందుకు రెడీ అంటున్నాయి. ఏపీ సర్కార్ రైతులకు మెరుగైన ధర కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి ఐహిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. మొత్తం మీద పూర్తిగా చెక్కర విషయంలో పట్టు కోల్పోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎంపై ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి