ఆర్ధిక సంక్షోభం..ఆటో సెక్టార్ పై ప్రభావం..!
మోదీ దెబ్బకు దేశ ఆర్థిక రంగం కోలుకోలేని స్థితికి చేరుకుంది. దీని దెబ్బకు దేశంలో అన్ని రంగాలపై పడింది. ఇందులో భాగంగానే వాహనం రంగంపై కూడా ప్రభావం చూపింది. తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కుంటోంది ఆటో రంగం. ఆటోమొబైల్ సెక్టార్ నానాటికీ దిగజారుతోంది. గత నెలలో వాహనాల అమ్మకాలు తగ్గి పోయాయి. ప్యాసింజర్ వెహికిల్స్ , టూ వీలర్స్ కు గిరాకీ కొంచం కూడా పెరగ లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 23 శాతం అమ్మకాలు పడిపోయాయి. ఇదే రంగంలో పనిచేస్తున్న వారిలో మూడు లక్షల మందికి పైగా ఆయా వాహనాల తయారీదారులు తొలగించారు. దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో 41 శాతం తగ్గాయి. ఇదే కాలంలో టూ వీలర్ల అమ్మకాలు 22 శాతం , సీవీల అమ్మకాలు 39 శాతం తగ్గి పోయాయి.
టూ వీలర్ సెగ్మెంట్ మార్కెట్ లీడర్ హీరో మోటోకార్స్ సేల్స్ 21 శాతం మేర తగ్గాయి. టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు కూడా తగ్గాయి. వాహనాలు అమ్ముడు పోక పోవడంతో యజమానులు భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తున్నారు. పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తున్నా వాహనదారుల నుండి స్పందన రావడం లేదు. దీంతో తయారీ ధరకే అంటూ తెలిపినా ఇటు వైపు చూడడం లేదు. కొత్త డిజైన్స్ , భారీ సౌకర్యాలు కల్పించినా అమ్మకాలు పెరగడం లేదు. ఇదే క్రమంలో ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు కొనుగోలుదారులకు. ఇన్ని ప్రయోగాలు చేపట్టినా వాహనాలు ఉన్నచోటనే వుండి పోయాయి. ఫోర్ వీలర్స్ విషయానికి వస్తే ఇండియాలో ఎప్పుడూ టాప్ పొజిషన్ లో వుండే మారుతి కార్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి.
ఇతర దేశాల కంపనీల కార్లు కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాహనాలు తయారు చేసే ప్లాంట్లను రెండింటిని ఇప్పటికే మూసి వేసింది. వాహన కంపెనీలు తమ ఉద్యోగాలను కోత పెడుతున్నాయి. వాహనాలపై ట్యాక్స్ వేయడం కూడా అమ్మకాలు తగ్గేందుకు మరో కారణం. భీమా పాలసీల రేట్లు బాగా పెరిగాయి. కొన్ని చోట్ల ఫైనాన్స్ దొరకడం కష్టమవుతోంది. ఆటో , వాహన రంగాలలో పోటీ అధికంగా ఉన్నది. అన్ని కంపెనీలు డిఫరెంట్ వేరియేషన్స్ తో వాహనాలను తయారు చేసినా అమ్మకాలు మాత్రం పెరగడం లేదు ..తగ్గుతూనే ఉన్నాయి. నిర్మాణ రంగంలో అత్యధిక శాతం ఉద్యోగాలను ఈ రంగమే కల్పిస్తోంది. ఇంత జరుగుతున్నా కేంద్రంలోని విత్త మంత్రి ఈ రంగాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కొన్ని మాడల్స్ లో లక్షల్లో డిస్కౌంట్స్ లభిస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు కొనుగోలుదారులు. మొత్తం మీద అన్ని సెక్టార్స్ కుదేలయ్యాయి. అందులో ఇది కూడా ఒకటి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి