మరాఠాలో పోరు రసవత్తరం
మరాఠాలో ఎన్నికల పోరు మరో యుద్ధాన్ని తలపింప చేస్తోంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, శివ సేన ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుండగా కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి బరిలో నిలిచాయి. ఎవరికి వారే గెలుపు తమదే అంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత దేశంలో బలమైన ఆర్ధిక వ్యవస్థకు పునాదిగా మరాఠాకు పేరున్నది. ఆర్థికంగా, వ్యాపారంగా, వాణిజ్య పరంగా, పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో ముంబై ప్రథమ స్థానంలో కొనసాగుతూ వస్తోంది. బీజేపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రభుత్వం కొలువై ఉన్నది. ఇందులో భాగంగా ఈ నాలుగు పార్టీలే అక్కడ కీలకం. ముంబయిలో ప్రధానంగా సినిమా పరిశ్రమ టాప్ లో ఉన్నది. దీనిపై ఆధారపడి బతుకుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు.
ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు దివంగత నాయకుడు బాల్ థాకరే మనుమడు ఆదిత్య థాకరే. ఆయన మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. తాజాగా శివసేన పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కేవలం 10 రూపాయలకే భోజనం అందజేస్తామని, ఒక్క రూపాయికే అన్ని వైద్య సేవలు ఇస్తామని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే, యువనేత ఆదిత్య థాకరే ప్రకటించారు. చుట్టూ పక్కల ప్రాంతాలకు తామే భోజనాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పొదుపు సంఘాల మహిళలను కూడా ఇందులో చేర్చుకోనున్నట్టు చెప్పారు. మరోవైపు ఇళ్లలో వినియోగించే విద్యుత్ చార్జీలలో 300 యూనిట్ల వరకు వచ్చే బిల్లులపై 30 శాతం రాయితీ కల్పించనున్నట్టు ప్రకటించారు. తమ ప్రధాన ఎజెండా ఒక్కటేనని అది విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమేనని స్పష్టం చేశారు.
ప్రజలకు అందుబాటులో లేని 200 రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కేవలం ఒక్క రూపాయికే అందించనున్నట్లు చెప్పారు. పేద రైతులకు ప్రతి సంవత్సరం 10 వేల రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 15 లక్షల పట్టభద్రులైన యువకులకు ‘యువ ప్రభుత్వం ఫెలో’ ద్వారా స్కాలర్‌షిప్ అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల నుంచి పాఠశాల వరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. విద్యార్థులందరికి మానసిక, శారీరక పరీక్షలు నిర్వహిస్తేలా చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామని ప్రకటించారు. శివసేన మేనిఫెస్టో కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి