మహిళలకు వీ - హబ్ వెన్ను దన్ను

ఐడియా వుంటే చాలు ఇక రుణాల కోసం , డబ్బుల కోసం , పెట్టుబడి కోసం ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు. మీదైన ఆలోచన సమాజానికి ఉపయోగ పడేలా , జీవితానికి మేలు చేకూర్చేలా..పధి మందికి ఉపాధి కల్పించేలా ..మోర్ ఇన్నోవేటివ్ గా వుంటే చాలు ..మీరు ఆంట్రపెన్యూర్స్ గా మారేందుకు వీ - హబ్ తోడ్పాటు అందిస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన ఆలోచలు కలిగిన వారి కోసమే టి - హబ్ ను ఏర్పాటు చేసింది . అది సక్సెస్ కావడంతో ప్రత్యేకించి కేవలం మహిళల కోసమని వీ - హబ్ కు శ్రీకారం చుట్టింది . దీంతో సాంకేతికంగా ఐడియా ఉందా లేదా అన్నది ముందుగా అనుభవం కలిగిన టీం పరిశీలిస్తుంది . అది వయబుల్ అనిపిస్తే వెంటనే కావాల్సినవన్నీ అక్కడే సమకూరేలా చేస్తుంది.
దీని వల్ల టైం సేవ్ అవుతుంది. కేపిటల్ దొరకదన్న బెంగ ఉండదు. దీంతో ఎవరైతే డిఫరెంట్ గా ఆలోచిస్తారో , తమ ఆలోచన రేపటి రోజుల్లో పనికి వస్తుందని భావిస్తారో వారు తప్పకుండా ప్రయత్నం చేస్తే మంచి సపోర్ట్ ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ పైరవీలు, దళారీల వ్యవస్థ ఉండదు. జస్ట్ మీకు మీరే పరిశీలించుకుని ముందుకు ధైర్యంతో వెళ్లగలిగితే చాలు వీ - హబ్ తోడుగా నిలుస్తుంది. అంతే కాకుండా మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. అంకుర సంస్థలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. మహిళలు, యువతులు ఎందరో దీని ద్వారా తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఆచరణ సాధ్యం అయ్యేలా సక్సెస్ అవుతున్నారు.
టెక్నాలజీ , లాజిస్టిక్ , ఆరోగ్యం విద్య , సోషల్ ఇస్యూస్ , మీడియా , ఎంటర్ టైన్మెంట్ , ట్రావెల్ , టూరిజం , ఫ్యాషన్ , బిజినెస్ , ఫుడ్ , తదితర వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. కొత్త కొత్త ఐడియాలతో ఆకట్టుకుంటున్నారు . కేవలం వీరికి మాత్రమే చోటుండడంతో ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు . వీ - హబ్ కు సీయీవోగా దీప్తి రావుల ఉండగా , వైష్ణవి రెడ్డి ప్రోగ్రాం అడ్మినిస్ట్రేటర్ గా పని చేస్తున్నారు . శకుంతల రూరల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ చూస్తుండగా, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ విషయంలో దుర్గ రవీంద్రన్ సూచనలు అందజేస్తారు . కావాల్సిందల్లా మీ ఆలోచన వర్కవుట్ అవుతుందా లేదా అన్నది మీరే బేరీజు వేసుకోవాలి. ఇక పెట్టుబడి అన్నది ఈజీగా దొరుకుతుంది. అయితే హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా దీనిని విస్తరింప చేస్తే మరికొందరు మహిళలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కామెంట్‌లు