కవ్విస్తున్న పాక్..సై అంటున్న భారత్
ఓ వైపు స్వాతంత్ర దినోత్సవ వేళ .. దాయాది పాకిస్తాన్ కవ్వింపులకు దిగుతోంది. యుద్దానికి సిద్ధమేనంటూ సంకేతాలు ఇస్తోంది. ఈ మేరకు ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇండియాతో వార్ కు రెడీగా ఉన్నామని , ఇందు కోసం దేశ సైనికులు , ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. యుద్ధమంటూ వస్తే అంతు తేలుస్తామని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దెబ్బకు దెబ్బ తప్పదని , గుణపాఠం చెప్పేందుకు తమ ఆర్మీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోందని చెప్పారు. తాజాగా ఇండియా జమ్మూ , కాశ్మీర్ ను మూడు విభాగాలుగా చేసింది. ఈ విషయంపై అటు అమెరికాకు , యుఎన్ఓ కు ఇమ్రాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేక పోయింది.
తాము కోరితే తప్పా ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఆ దేశ ప్రెసిడెంట్ ట్రాంప్ స్పష్టం చేశారు . నిన్నటి దాకా తమకు అండగా ఉంటుందని భావించిన పాక్ కు యుఎస్ కోలుకోలేని షాక్ ఇచ్చింది . రష్యా కూడా ఇండియా చేసింది కరెక్టేనని, అది ఆ దేశ ఆంతరంగిక వ్యవహారమని ప్రెసిడెంట్ పుతిన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ వేదికపై దీనిని ఓ సమస్యగా చిత్రీకరించాలని అనుకున్న పాకిస్థాన్ కు గర్వభంగం కలిగింది. చైనా కూడా మౌనం వహించింది. మోడీ మాత్రం దీని గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. తన పని తాను చేసుకు పోతున్నారు. వీలైతే ఎప్పుడైనా యుద్ధం చేసేందుకు వెనుకాడ కూడదని భారత సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
సాయుధ బలగాలు నిరంతరం వాస్తవాధీన రేఖ వద్ద గస్తీ కాస్తున్నాయి. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ కుమార్ దోవల్ అన్ని విభాగాలను అప్రమత్తం చేసారు. ఓ వైపు అమెరికా పాక్ ను జాగ్రత్తగా ఉండమని చెప్పింది . అంతే కాక ఆ దేశంలో కొన్నేళ్లుగా పాతుకు పోయిన తీవ్రావాదులను ఏరి వేయాలని స్పష్టం చేసింది . దీంతో పాకిస్తాన్ దిక్కు తోచని స్థితిలో పడి పోయింది . దోవల్ దెబ్బకు దావూద్ లాంటి నేతలు పాకిస్తాన్ నుండి వేరే ప్రాంతానికి మారి పోయారు . మొత్తం మీద దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పెద్దన్న అమెరికా కొంచం సంయమనం పాటించాలని ఇరు దేశాధినేతలకు సూచించింది . మోడీ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి