సేమ్ సీన్ .. ఇండియానే విన్..!

మాంచి ఊపు మీదున్న టీమిండియా జట్టు వెండీస్ పై విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది . ఎప్పటి లాగానే సారధి కోహ్లీ సెంచరీ సీజేయగా శ్రేయస్ అయ్యర్ 65 పరుగులు చేసి రాణించారు . ముందుగా మైదానంలోకి దిగిన విండీస్  35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్రిస్ గేల్, లూయిస్ లు రెచ్చి పోయారు. భారత బౌలర్ల భరతం పట్టారు . వర్షం రావడంతో ఓవర్లను కుదించారు . డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు.
32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కోహ్లీ సేన లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దైంది. విండీస్‌ బ్యాటింగ్‌కు దిగి రెండు ఓవర్లు ముగిసే లోపే వర్షం రావడం ..తిరిగి స్టార్ట్ కావడం జరిగింది . 22 ఓవర్‌లో మరోసారి వాన రావడంతో కొద్దీ సేపు ఆగి పోయింది . గేల్  కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. నిర్దేశించిన  ఓవర్లలో వెస్టిండీస్‌ 7 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు బరిలోకి దిగిన ఇండియా   ఆరంభంలోనే రోహిత్‌  వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవర్‌లో రెండు బౌండరీలు బాది ఊపు మీదున్న హిట్‌మ్యాన్‌.. మూడో ఓవర్‌లో లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు .
మరో ఓపెనర్‌ ధావన్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ నిలబెడుతూ వచ్చాడు. విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఈ జోడీ కుదురుకున్నట్లే కనిపించింది. అలెన్‌ బౌలింగ్‌లో ధావన్‌ అనవసరపు షాట్‌ ఆడి కీమో పాల్‌ చేతికి చిక్కాడు. నాలుగో స్థానంలో వచ్చిన పంత్‌ నిరాశ పరిచాడు .ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కష్టాల్లో ఉన్న భారత్ ను ఆదుకున్నారు . కోహ్లీ , శ్రేయస్ లు పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి కీలక 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫామ్ లో ఉన్న కోహ్లీ మళ్ళీ రెచ్చి పోయాడు. తన బ్యాట్ కు పని చెప్పాడు . సెంచరీ సాధించి మరో రికార్డ్ సృష్టించాడు . ఈ సెంచరీతో కోహ్లీ సెంచరీల సంఖ్య 43 కు చేరుకున్నాయి . విండీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు . ఇండియా గెలుపుతో సిరీస్ చేజిక్కించుకుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!