సమ్మె తీవ్రతరం..తగ్గని ప్రభుత్వం..పరిస్థితి ఉద్రిక్తం
తెలంగాణాలో రోజు రోజుకు బతికే అవకాశాలు కనిపించడం లేదు. కొన్ని తరాల పాటు కాపాడుకుంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు అంపశయ్యపై నిలబడింది. గత పాలకుల అవినీతికి తోడు ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యం వేలాది మంది కార్మికులు సమ్మె చేసేలా, ఆందోళనలు చేపట్టేలా చేసింది. గతంలో పలుసార్లు శాంతియుతంగా నిరసన తెలిపారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం తో పాటు రాష్ట్ర కార్మిక శాఖకు అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కార్మికులు పోరాటబాట పట్టారు. పండుగ వేళ పస్తులున్నారు. తమ సంస్థను ప్రభుత్వ పరం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నోటీసులో పేర్కొన్నారు.
అయినా సీఎం డోంట్ కేర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పరం చేయబోమని, 50 శాతం ప్రైవేట్ పరం చేస్తున్నట్లు సెలవిచ్చారు. దీనిపై ప్రజాప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు లో పిల్ దాఖలు చేశారు. ఇరు వైపు వాదనలు విన్న కోర్టు 15 వరకు తీర్పు వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెతో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్, వాహనాలలో అధిక చార్జీలు వసూలు చేస్తూ జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుండి సానుకూల స్పందన కనిపించక పోవడంతో అన్ని సంఘాలు జేఏసీ గా ఏర్పడ్డాయి. టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డిని జేఏసీ కన్వీనర్ గా ఎన్నుకున్నారు. ఆయన అన్ని సంఘాలతో కలిసి బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం , టీజేఎస్, జనసేన, తెలంగాణ ప్రజా పార్టీ తో పాటు ప్రజా, మహిళా, విద్యార్ధి సంఘాల మద్దతు కోరారు.
ఆ మేరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతలు గవర్నర్ ను కలిశారు. జస్టిస్ చంద్రకుమార్, కోదండ రామ్, చాడ వెంకట్ రెడ్డి, మందకృష్ణ మాదిగ, తమ్మినేని సీతారాం , రామ్ చందర్ రావు, రేవంత్ రెడ్డి, తదితరులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయా డిపోల ఎదుట శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు దాడులకు పాల్పడ్డారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వరంగల్, కరీం నగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ , ఖమ్మం, నిజామాబాద్ , తదితర జిల్లాలలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి