అమెరికాను దాటేసిన సింగపూర్
ప్రపంచ పోటీతత్వ సూచీలో ఊహించని రీతిలో అగ్ర రాజ్యం అమెరికాను దాటేసింది సింగపూర్ కంట్రీ. కాగా గత ఏడాది ఐదు పాయింట్లు సాధించిన భారత దేశం మాత్రం మరోసారి నిరాశ పరిచింది. ఏకంగా పది స్థానాలు దిగజారి 68 వ స్థానానికి పడి పోయింది. ప్రతి ఏటా ప్రపంచ ఆర్ధిక వేదిక ప్రపంచ వ్యాప్తంగా ర్యాంక్ లు ఇవ్వడం పరిపాటిగా వస్తూనే ఉన్నది. తాజాగా 2019 సంవత్సరానికి గాను ఆయా దేశాలకు సంబంధించిన ప్లేస్ లను వెల్లడించింది. 71 వ స్థానంతో బ్రిక్స్ దేశాలలో బ్రెజిల్ చివరి స్థానంలో నిలిచింది. ఇక 28 వ ప్లేస్ లో చైనా ఉండగా, శ్రీలంక 84 వ స్థానంతో సరి పెట్టుకుంది. బాంగ్లాదేశ్ 105 స్థానంతో సరి పెట్టుకోగా నేపాల్ కంట్రీ మాత్రం 108 ప్లేస్ లో వుండి పోయింది. మార్కెట్ పరంగా , స్థూల ఆర్ధిక వ్యవస్థలో ఇండియా స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది.
బ్యాంకింగ్ వ్యవస్థను కుంగదీస్తున్న నిరర్ధక ఆస్తులు, రుణాలు ఎగవేతదారుల సమస్యలు ఇబ్బందులు పెడుతున్నప్పటికినీ భారత్ ప్రగతి దారుల్లో అడుగులు వేస్తోందని స్పష్టం చేసింది ఈ సంస్థ. ఇక కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా చూస్తే ఇండియా గణనీయమైన స్థానాన్ని సాధించింది. ఏకంగా 15 వ ప్లేస్ లో నిలిచింది. షేర్ హోల్డర్ గవర్నెన్స్ విభాగంలో ఈసారి రెండవ స్థానం చేజిక్కించుకుంది. ఇతర దేశాలు విస్తుపోయేలా చేరుకుంది. ఇక పునరుత్పాదక ఇంధన నియంత్రణలో ప్రపంచంలోనే మూడో ప్లేస్ దక్కించుకుంది. న్యూ ఇన్నోవేషన్ సెక్టార్ లో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ఇండియా శరవేగంగా పురోభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని తెలిపింది.
అయితే ఆయుర్దాయం, విద్య, ఆరోగ్యం, కనీస వసతుల కల్పన విషయంలో భారత్ మిగతా దేశాల కంటే వెనకనే ఉండడం విస్తు పోయేలా చేసింది. సమాచార శాస్త్ర సాంకేతికతను అంది పుచ్చుకోవడంలో ఇండియా వెనక్కు వెళ్లడం కొంచెం ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఒక్క అంశమే ఇండియాను వెనక్కి వెళ్లేలా చేసిందన్నది వాస్తవం. ఇప్పటికే భారతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పూర్తిగా కుంటుపడుతోంది. ఎంతగా ఉద్దీపన చర్యలు చేపడుతున్నా ఈ రోజు వరకు పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు అగుపించడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ జపం మానేసి దేశాభివృద్ధి కోసం చర్యలు చేపడితే బావుంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి