మెరిసిన హైదరాబాద్..మురిసిన ముంబై
ఐటీలో టాప్ రేంజ్ లో దూసుకెళుతున్న హైదరాబాద్ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ప్రపంచంలో క్రియేటివిటీ నగరాల లిస్టులో మన భాగ్యనగరం మెరిసింది. తాజగా యునెస్కో ప్రకటించిన లిస్టులో ఆహార విభాగంలో సిటీకి కూడా చోటు దక్కింది. నోరూరించే బిర్యానీ, హలీం, ఇరానీ చాయ్‌కి నగరం పెట్టింది పేరు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చడానికి మన కేపిటల్ సిటీని ఎంపిక చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 66 నగరాలకు ఈ నెట్‌వర్క్‌లో చోటు లభించగా, అందులో మన దేశం నుంచి రెండు సిటీస్ ను మాత్రమే ఎంపిక చేశారు.
హైదరాబాద్ సిటీని ఫుడ్ విభాగంలో సెలెక్ట్ చేస్తే..ముంబై నగరం సినిమా రంగం నుంచి స్థానం దక్కించు కున్నది. నగరాన్ని క్రియేటివ్ సిటీల జాబితాలో చేర్చడం పట్ల నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐటీ హబ్ గా ఈ పట్టణం వినుతికెక్కింది. మెట్రో సర్వీసెస్ కూడా వాడుకలోకి వచ్చింది. మన దేశం నుంచి 12 నగరాలు ఈ నెట్‌వర్క్‌లో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో ఎనిమిది నగరాలు మాత్రమే నియమిత సమయంలో నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తులను యునెస్కోకు సమర్పించాయి. పరిశీలనలో హైదరాబాద్, ముంబై, లక్నో, శ్రీనగర్ మరో నాలుగు నగరాలు మాత్రమే నామినేట్ కాగా, అందులో హైదరాబాద్, ముంబై నగరాలకే క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం లభించింది.
ఈ సందర్భంగా మొత్తం ఏడు విభాగాల్లో క్రియేటివ్ నగరాలను ఎంపిక చేశారు. హైదరాబాద్ బిర్యానీ, రంజాన్ నెలలో లభించే హలీంతో పాటు దేశంలో ఎక్కడా లభించని విధంగా అనేక తిను బండారాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఆఫ్రికా, అమెరికా, చైనా, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల రుచి కరమైన పదార్థాలు హైదరాబాద్ లో దొరుకుతున్నాయి. వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రజలతో మినీ భారత్‌గా వర్ధిల్లుతోంది. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం వరల్డ్ వైడ్ గా పేరొందాయి. వీటితో పాటు బెంగాలీ, గుజరాతీ స్వీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఎంపిక వల్ల పర్యాటక పరంగా కొంత మేలు జరగవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి