అమెరికాకు డ్రాగన్ షాక్

ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాశించాలని ఉవ్విల్లూరుతున్న అమెరికాకు కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చింది డ్రాగన్. అటు మార్కెట్ లో ఇటు టెక్నాలజీలో టాప్ రేంజ్ లో కొసనసగుతోది చైనా కంట్రీ. ఇందులో భాగంగా ఇప్పటికే యూఎస్ కు చెందిన పలు దిగ్గజ కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. స్మార్ట్ మొబైల్స్ తయారీలో వరల్డ్ లో మూడో ప్లేస్ లో నిలిచింది డ్రాగన్ కు చెందిన షావో మీ మొబైల్ కంపెనీ. ఇదిలా ఉండగా టెక్నాలజీ వినియోగంలో అమెరికాను అధిగమించే క్రమంలో చైనా తాజాగా 5జీ టెలికాం సేవలకు శ్రీకారం చుట్టింది. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు ఈ సర్వీసులు ఒకే రోజున ప్రారంభించాయి.

బీజింగ్, షాంఘై తదితర 50 నగరాల్లో తమ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని చైనా మొబైల్‌ సంస్థ వెల్లడించింది. ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి అంటే 18 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. అటు పోటీ సంస్థలైన చైనా టెలికం, చైనా యూనికామ్‌ కూడా ఇదే స్థాయి టారిఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉండే 5జీ సేవలతో సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిడివి సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డ్రైవర్‌ రహిత కార్లు, ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్‌ వంటి వాటికి ఇవి భారీ ఎత్తున ఉపయోగ పడనున్నాయి.

వచ్చే ఏడాది నాటికి 17 కోట్ల మంది యూజర్లతో 5జీ వినియోగంలో చైనా అగ్ర స్థానంలో నిలుస్తుందని, సుమారు 75,000 మంది యూజర్లతో దక్షిణ కొరియా రెండో స్థానంలో, 10,000 మంది వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో ఉండొచ్చని టెలికాం వర్గాలు అంచనా వేస్తున్నాయి. 5జీ పరికరాల ఉత్పత్తిలో టాప్ పొజిషన్ లో ఉన్న చైనా సంస్థలు హువావే, జెడ్‌టీ ఈలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తం మీద అటు వ్యాపారం లోను ఇటు ఆయుధాల లోను..ఆర్ధిక రంగం లోని చైనా అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!