టీ సాట్ కు పురస్కారం..శైలేష్ కు గౌరవం

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రాంపురం శైలేష్ రెడ్డి జగమెరిగిన బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్. స్పెషల్ కరెస్పాండెంట్ గా ప్రారంభమైన కెరీర్ సీఈఓ స్థాయికి చేరుకునేలా చేసింది. నిబద్దత కలిగిన వ్యక్తిగా ప్రారంభమైన జీవితం ఒక వ్యవస్థగా మారేలా చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో శైలేష్ రెడ్డిది విస్మరించలేని పాత్ర ఉన్నది. పోరాటాలకు పెట్టింది పేరైన ఉస్మానియాయా యూనివర్సిటీలో చదువుకున్నారు. జర్నలిజంలో ప్రత్యేక అనుభవాన్ని గడించారు. ఇదే సయమంలో రామోజీరావు ఆధ్వర్యంలోని న్యూస్ టైం ఇంగ్లిష్ పత్రికలో స్పెషల్ కరెస్పాండెంట్ గా జాయిన్ అయ్యాడు. ఢిల్లీలో పని చేశాడు. మొదటి నుంచి ఏ పనిని చేపట్టినా దానిని నిబద్దతతో సక్సెస్ చేసేందుకు కృషి చేస్తూ వచ్చారు.

ఇదే సమయంలో శైలేష్ లోని స్పార్క్, టాలెంట్ ను గుర్తించిన రామోజీ రావు ఈటివి లో అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచారు. తనను తాను కమిటెడ్ జర్నలిస్టుగా పిలుచుకునేలా చేశారు. స్పెషల్ స్టోరీస్, ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఇచ్చాడు. దీంతో ఆయన పనితీరుకు అరుదైన అవకాశం లభించింది. శైలేష్ ను తలుపు తట్టింది. ఇండియాలో అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన జీ గ్రూప్ లిమిటెడ్ కంపెనీకి చెందిన చైర్మన్ సుభాష్ చంద్ర నుంచి పిలుపు వచ్చింది. జీ సౌత్ హెడ్ గా పని చేశారు. జీ ఆల్ఫా తెలుగు ఛానల్ హెడ్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జీ 24 గంటలు న్యూస్ ఛానల్ శైలేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఇది ఐదున్నర ఏళ్ళ పాటు సక్సెస్ ఫుల్ గా నడిచింది.

మిగతా ఛానల్స్ కమర్షియల్ పరంగా ప్రయారిటీ ఇస్తే శైలేష్ మాత్రం ఛానల్ ను నమ్మకమైన కంటెంట్ కలిగిన ఛానల్ గా తీర్చి దిద్దాడు. ఓ వైపు ఇబ్బందులు ఉన్నప్పటికీ తాను మాత్రం సామాజిక బాధ్యతగా ఛానల్ ను తీసుకు వెళ్ళాడు. తెలంగాణ న్యాయమైన పోరాటానికి వెన్ను దన్నుగా ఉన్నారు. జీ 24 గంటలు ఛానల్ కెమెరామెన్ గుప్తా పై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఓయూలో ఆందోళన చేపట్టాడు. మేనేజ్ మెంట్ వత్తిళ్ళను తట్టుకుని, సిబ్బందిపై ఈగ వాలకుండా చివరి వరకు చూసుకున్నాడు. అనుకోని రీతిలో ఛానల్ ను సుభాష్ చంద్ర మూసి వేశారు. జర్నలిస్ట్ యూనియన్ లీడర్ గా జర్నలిస్టుల కోసం పని చేశాడు. ఇదే క్రమంలో శైలేష్ కు మొదటి నుంచి పాలిటిక్స్ అంటే ఇష్టం. విద్యార్ధి గా ఉన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి.

బీజేపీలో ఆయన చేరారు. కానీ ఆ పార్టీ సరిగా వాడు కోలేక పోయింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం శైలేష్ చేసిన సహాయాన్ని మర్చి పోలేదు. అందుకే ఆయనకు టీ సాట్ అధికార ఛానల్స్ కు సిఇఓ గా బాద్యతలు అప్పగించింది. దానిని గ్రామీణ స్థాయికి తీసుకు వెళ్లడంలో ఆయన పాత్ర ఉన్నది. తాజాగా డిజిటల్ విద్యలో విశిష్ట సేవలు అందించినందుకు గాను అరుదైన గౌరవం లభించింది. గవర్నెన్స్ నౌ సంస్థ ఆధ్వర్యంలో అందించే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుకు టీ సాట్ ఎంపికైంది. ఈ పురస్కారాన్ని ఢిల్లీలో ఆరున అందుకోనున్నారు రాంపురం శైలేష్ రెడ్డి.

ఈ నెట్ వర్క్ ఛానల్స్ ప్రస్తుతం తెలంగాణ ఐటీ, సమాచార శాఖా పరిధిలోనడుస్తున్నాయి. గత మూడేళ్ళుగా మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచితంగా విద్యాపరంగా సేవలు అందిస్తోంది. ఇవి ఎంతో ఆదరణ పొందాయి. ఛానల్స్ ద్వారానే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా అందుబాటులో ఉండేలా చేసిన ఘనత శైలేష్ రెడ్డిదే. మొత్తం మీది ఈ పురస్కారం..శైలేష్ కు..తెలంగాణకు..పాలమూరు జిల్లాకు దక్కిన గౌరవంగా భావించాలి. ఈ సందర్బంగా మిత్రుడికి అభినందనలు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!