రాహుల్ తో పాటే రవిశాస్త్రి
దాదా అంటేనే దూకుడు. ఎవ్వరి మాటా వినడు. కానీ ఎవ్వరు చెప్పినా వింటాడు. ఆటను కెరీర్ గా కాకుండా పూర్తి ప్రొఫెషనల్ గా చూసే ఈ మాజీ ఆటగాడు వెరీ స్పెషల్. క్రికెటర్ గా, మాజీ టీమిండియా సారధిగా, కన్సల్టెంట్ గా, కామెంటేటర్ గా, ఇలా ఏ ఫార్మాట్ లో పని చేసినా దానికి 100 శాతం న్యాయం చేశాడు దాదా. అయితే మొదటి నుంచీ దాదాకు, భారత జట్టు కోచ్ రవిశాస్త్రి మధ్య మాటలు లేవు. అయినా ఎవ్వరి పట్లా కోపాన్ని కలిగి ఉండని ఈ మాజీ ఆటగాడు ఏది చేసినా అది దేశ ప్రయోజనం కోసమే ఉంటుంది. ఎప్పుడైతే బిసిసిఐ కి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడా, సమూల మార్పులకు శ్రీకారం చుట్టాడు.
తాజాగా రవిశాస్త్రిని పూర్తిగా వాడు కోవాలని స్పష్టం చేశాడు. బెంగళూర్ లో ఉన్న రాహుల్ ద్రావిడ్ ను కలిశాడు. క్రికెట్ భవిశ్యత్తుపై సమాలోచనలు చేశాడు. ద్రవిడ్ పర్యవేక్షణలో ఎన్‌సీఏను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పని చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌లో ఉన్న హై ఫెర్ఫామెన్స్ సెంటర్ తరహా కేంద్రాన్ని రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రిని మరో రకంగా కూడా వాడుకోవాలని అనుకుంటున్నాం.ఎప్పటి వరకు కోచ్‌గా కొనసాగుతాడో అప్పటి దాకా అతని సేవల్ని ఎన్‌సీఏలో కూడా మిళితం చేస్తాం. ద్రవిడ్‌తో పాటు రవిశాస్త్రి, పారాస్ మాంబ్రే, భరత్ అరుణ్‌లు కూడా ఇందులో పని చేస్తారు.
ఎన్‌సీఏను ఒక అద్భుత సెంటర్‌గా రూపొందించాలనే యత్నంలో ఉన్నాం అని గంగూలీ తెలిపాడు. ద్రవిడ్ ఎన్‌సీఏ హెడ్. క్రికెట్‌లో అతనొక దిగ్గజం. ఎన్‌సీఏ విధి నిర్వహణకు సంబంధించి నేను తెలుసు కోవాలని భావించే ద్రవిడ్‌తో సమావేశమయ్యా. ఎన్‌సీఏ కోసం కొత్త బిల్డింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మా మధ్య సమావేశం దాదాపు రెండు గంటలు జరిగింది. బెంగళూరు నడిబొడ్డన ఎన్‌సీఏ ఉంది. అంతకంటే మంచి వేదిక ఇంకొటి దొరకదు అని దాదా చెప్పాడు. మొత్తం మీద రావిశాత్రికి చెక్ పెట్టాడు బెంగాలీ బాబు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి