టైటిల్ ను ముద్దాడేది ఎవ్వరో


తెలుగు నాట స్టార్ మాటివి పాపులర్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ తో రియాల్టీ షోస్, సీరియల్స్ టెలికాస్ట్ చేస్తూ జనాదరణ చూరగొంటోంది. కొన్ని గంటల్లో బిగ్ బాస్ ముగియనుంది. తెలుగులో మొదటగా బిగ్ బాస్ ను నటుడు జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ చేయగా, రెండో బిగ్ బాస్ ఎపిసోడ్ ను మరో నటుడు నాని ప్రయోక్తగా ఉన్నారు. మూడో ఎపిసోడ్ బిగ్ బాస్ షో ను పాపులర్ హీరో అక్కినేని నాగార్జున స్టార్ట్ చేశాడు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా వంద రోజులు పూర్తి చేసుకుంది. పార్టిసిపెంట్స్ ఇప్పటి దాకా వినోదాన్ని పంచారు. దీంతో తెలుగు నాట అందరూ బిగ్‌ బాస్‌ జపం చేస్తున్నారు.

ఇక్కడే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్‌ సమరంలో ఎవరు నెగ్గుతారు. ఎవరు ఏ స్థానానికి పరిమితమై పోతారు అనేది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ప్రశ్నకు వీకెండ్స్‌లో సమాధానం దొరక నుండగా, ఇప్పటి నుంచే జనాలు టీవీలకు అతుక్కు పోయారు. ఇక శ్రీముఖి, రాహుల్‌ సిప్లి గంజ్‌, అలీ రెజా, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌ టాప్‌ 5లో చోటు దక్కించు కున్నారు. అయితే అలీ రెజా, బాబా మాత్రం ఓటింగ్‌లో చాలా వెనుకబడి పోయారు. దీంతో వీళ్లు టైటిల్‌ రేసు నుంచి తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక వరుణ్‌కు అభిమానుల మద్దతు గట్టి గానే ఉన్నప్పటికీ టైటిల్‌ గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు మాత్రం రాబట్టు కోలేక పోయాడు. శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ మాత్రం ఒకరిని మించి మరొకరు ఓటింగ్‌లో దుమ్ము లేపుతున్నారు. గత రెండు రోజుల్లో ఓట్ల రేసులో కాస్త వెనుకబడ్డ రాహుల్‌ ప్రస్తుతం శ్రీముఖిని అధిగ మించినట్లు సమాచారం. అయితే నేడు కూడా ఓటింగ్‌కు అవకాశం ఉండటంతో ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. మరి టైటిల్‌ను అందుకుని గెలుపును ముద్దాడేది ఆమెనా, అతడా? అన్నది తేలనుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!