ఈ కామర్స్ సెక్టార్ పై రిలయన్స్ కన్ను



భారతీయ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మిగతా రంగాలపై కూడా పట్టు బిగించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఆభరణాలు, వజ్రాలు, ఆయిల్, టెలికాం, ఫ్యాషన్, షూస్, డిజిటల్, యాక్సరీస్, తదితర సెక్టార్స్ లలో టాప్ రేంజ్ లో కొనసాగుతోంది. మరో వైపు ఈ కామర్స్ పరంగా చూస్తే ఇండియా అతి పెద్ద మార్కెట్ గా ఉంటోంది. ప్రపంచ మార్కెట్ లో పారిశ్రామిక దిగ్గజం జాక్ మా స్థాపించిన అలీబాబా కంపెనీ ఈ కామర్స్ లో నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతూ వస్తోంది. దీనిని దెబ్బ కొట్టేందుకు అమెరికా నానా ప్రయత్నాలు చేసింది.

అయినా జాక్ మా పట్టుదల ముందు బోసి పోయింది. ఈ రోజు వరకు కోట్లాది రూపాయలు ప్రతి రోజు అలీబాబా కంపెనీకి సమకూరుతున్నాయి. అలీబాబా సక్సెస్ ను దృష్టిలో పెట్టుకున్న రిలయన్స్ కంపెనీ ఈ కామర్స్ బిజినెస్ లోకి ఎంటర్ కావాలని డిసైడ్ అయ్యింది. పారిశ్రామిక దిగ్గజం​ ముఖేష్‌ అంబానీ చైనాలో అలీబాబా తరహాలో భారత్‌లో ఈకామర్స్‌ దిగ్గజ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్‌లో కీలక వాటా దక్కించు కోవాలన్న తన కలను పండించు కునేందుకు 1.73 లక్షల కోట్లతో పూర్తి యాజమాన్య హక్కులతో సబ్సిడరీని ఏర్పాటు చేస్తున్నారు. 65,000 కోట్లతో ఏర్పడే హోల్డింగ్‌ కంపెనీకి రిలయన్స్‌ జియోలో కంపెనీకి ఉన్న 65,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని తరలిస్తారు.

మరోవైపు జియో రుణాలన్నింటినీ మాతృ సంస్థకు తరలిస్తారు. దీంతో 2020 మార్చి నాటికి జియో పూర్తిగా రుణ రహిత కంపెనీగా ఎదుగుతుంది. మరోవైపు ముఖేష్‌ ఈ కామర్స్‌ ప్రణాళికలకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. డేటా, డిజిటల్‌ సర్వీసులపై ముఖేష్‌ అంబానీ దృష్టి సారించారు. అమెజాన్‌, వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో తల పడేందుకు భారీ పెట్టుబడులతో ఈ కామర్స్‌ ఫ్లాట్‌ ఫాం ముఖేష్‌ అడుగు పెడుతుండటంతో ఈ మార్కెట్‌లో రసవత్తర పోరుకు తెర లేవనుంది.  

కామెంట్‌లు