వాల్ తో దాదా ములాఖత్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన దాదా, సౌరబ్ గంగూలీ తన దూకుడు పెంచాడు. వెంటనే రంగం లోకి దిగాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో మాట్లాడాడు. కోల్ కత్తా లో త్వరలో జరిగే టెస్టు మ్యాచ్ ను డే అండ్ నైట్ లో నిర్వహించాలని డిసైడ్ అయ్యాడు. ఆ జట్టును ఒప్పించాడు. అంతే కాకుండా క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్యెస్కె ప్రసాద్ తో భేటీ అయ్యాడు. సీనియర్ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ తో సుదీర్ఘంగా చర్చించాడు. ఎందుకంటే అజ్జూ భాయ్ సారధిగా ఉన్నప్పుడే గంగూలీ తన క్రికెట్ ను స్టార్ట్ చేశాడు. ఇదే టీమ్ గొప్ప విజయాలు నమోదు చేసుకుంది. ఇండియాలో గొప్ప టీమ్ గా పేరు తెచ్చుకుంది కూడా. దాదా సభ్యుడిగా అజ్జుతో కలిసి ఆడాడు.
బెంగాలీ అసోషియేషన్ ఉత్సవాల్లో స్పెషల్ గా అజ్జూ భాయ్ హాజరయ్యాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు హైదరాబాద్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఈ స్టైలిష్ స్టార్ ఎన్నికయ్యాడు. ప్రస్తుతం దాదా దేశంలో క్రికెట్ కు పూర్వ వైభవం తీసుకు రావాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందులో భాగంగా మాజీ టీమిండియా సారథి రాహల్ ద్రావిడ్ తో సమావేశం కానున్నాడు. భవిష్యత్తు క్రికెట్ కోసం ప్లాన్ తయారు చేసే పనిలో పడ్డాడు. ఇందు కోసం దాదా ద్రవిడ్ తో చర్చించ నున్నాడు. టీమిండియా రోడ్ మ్యాప్‌కు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేయ బోతున్నాడు. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్‌తో సమావేశం కానున్నాడు. బెంగళూరులో ద్రవిడ్‌తో గంగూలీ చర్చించనున్నాడు.
భారత క్రికెట్ జట్టు తరఫున సుదీర్ఘ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఇద్దరు ‘క్రికెట్ మిత్రులు’ తొలిసారి జట్టు గురించి సమాలోచన చేయనున్నారు. ద్రవిడ్ ఇచ్చే ఇన్‌పుట్స్ ఆధారంగా ఒక ప్రణాళిక రూపొందించాలని గంగూలీ భావిస్తున్నాడు. అదే సమయంలో ఎన్‌సీఏలో ద్రవిడ్ దృష్టికి వచ్చిన సమస్యలపై కూడా గంగూలీ ఆరా తీయనున్నాడు. ఈ సమావేశానికి ఎన్‌సీఏ సీఈఓ తుఫాన్ గోష్ కూడా హాజరు కానున్నారు. భారత్-ఏ, అండర్-19 జట్లకు ప్రధాన కోచ్‌గా పని చేసిన ద్రవిడ్..ఎన్‌సీఏ హెడ్‌గా నియమించబడ్డారు. ఈ హెడ్ కోచ్ పదవికి పలువురు పోటీ పడ్డప్పటికీ అనుభవం ఉన్న ద్రవిడ్‌నే నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి