మెగా సమేతం..నాగబాబు జన్మోత్సవం
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఈ ఏడాది మరిచి పోలేని తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. తాజాగా చిరంజీవి, నయనతార, తమన్నా కలిసి నటించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా విడుదలైంది. భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వసూళ్ళలో రికార్డులు తిరుగ రాస్తోంది. ఇది చిరంజీవికి 151 వ చిత్రం. ఈ మూవీ చిరంజీవి కెరీర్ లోనే హయ్యెస్ట్ వసూలు సాధించింది. దీంతో కోడలు ఉపాసన రెడ్డి, కొడుకు రామ్ చరణ్, తమ్ముళ్లు కొణిదెల పవన్ కళ్యాణ్, కొణిదెల నాగ బాబుతో పాటు కూతుళ్లు, భార్య సురేఖ, బావ అల్లు అరవింద్, అల్లు అర్జున్, తదితరులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఇదే సమయంలో సైరా సినిమా ప్రమోషన్ లో తమ్ముడు, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు కొడుకు రామ్ చరణ్. ఇదిలా ఉండగా ఇదే సమయంలో తమ్ముడు నాగేంద్ర బాబు పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నారు. తన అన్న చిరంజీవి, వదిన సురేఖ ల సమక్షంలో వేడుకలను నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరిపారు. ఈ ఆనంద వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. నాగబాబుకు అభినందనలు తెలిపారు. నాగబాబు 1961 అక్టోబరు 29 న పుట్టారు. ఆయనకు ఇప్పుడు 58 ఏళ్ళు. నటుడిగా, నిర్మాతగా నాగబాబు పేరు తెచ్చుకున్నారు.
బుల్లి తెరపై టాప్ రేంజ్ నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన హోస్ట్ చేస్తున్న ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం టీఆర్ఫీ రేటింగ్ లో నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతోంది. కూతురు కొణిదెల నిహారిక, కొడుకు వరుణ్ తేజ్ సైతం తమ తండ్రి నాగబాబుతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. ఆయన ఎన్నో సినిమాలలో నటించారు. మృగరాజు, అన్న వరం, అమ్మ చెప్పింది, మురారి, అంజి, సర్కార్, ఆపద మొక్కుల వాడు, అగ్రిమెంట్, 420 , కొండ వీటి దొంగ, మరణ మృదంగం, అందరు దొంగలే, త్రినేత్రుడు సినిమాల్లో నటించారు.
అందమైన అబద్ధం, అల్లరోడు, అంజని పుత్రుడు, మనసు మాట వినదు, గొడవ, శ్రీ, ఒక్కడే, ఏక్ పోలీస్, ఆపరేషన్ దుర్యోదన, మెంటల్ కృష్ణ, శ్రీ రామదాసు, గణపతి మూవీస్ లో మెప్పించారు. ప్రియురాలు, రుక్మిణి, బావగారు బాగున్నారా, ఆటాడిస్తా, చందమామ, శ్రీశైలం, ఆకాశ రామన్న, ఆరెంజ్, మిరపకాయ్, షాక్, తూనీగా తూనీగా, జీనియస్, షాడో, చండీ, మాయ, రోమియో, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , జవాన్ , మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించారు నాగబాబు. నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి