గ్లోబల్ సీఈఓల్లో మనోళ్లే టాప్



ప్రపంచంలో భారత్ వెలిగి పోతోంది. వ్యాపార, వాణిజ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కృత్రిమ మేధో మధనం, క్రీడా, మహిళా సాధికారత రంగాలలో ఇండియన్స్ తమదైన పాత్రను పోస్తిస్తున్నారు. ఎవ్వరికీ అందనంత రీతిలో, అసాధారణమైన ప్రతిభా పాటవాలతో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. అంతే కాకుండా అగ్ర రాజ్యాలకు పెను సవాలు విసురుతున్నారు. ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికా ఐటీ సెక్టార్లో మనోళ్లదే హవా. వీరి ఆధిపత్యానికి చెక్ పెట్టాలని అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ఆ దేశ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. కానీ భారత ప్రధాన మంత్రి మోదీ ఆయన ఆశలకు గండి కొట్టారు.

ఏకంగా ఆ దేశ అభివృద్ధిలో భారతీయులు 30 శాతానికి పైగా సేవలు అందిస్తున్నారు. దీంతో ప్రతి పార్టీకి భారతీయుల సహకారం అవసరమవుతోంది. వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న దిగ్గజ కంపీలకు ఇండియన్స్ కీలక పదవులలో కొనసాగుతున్నారు. ప్రెసిడెంట్, చైర్మన్, సిఇఓలు, హెడ్స్..ఇలా ప్రతి ప్రధానమైన పోస్టుల్లో భారతీయులు తమ జెండాను ఎగురవేస్తున్నారు. తాజాగా వరల్డ్ వైడ్ గా టాప్ సీఈఓ లు 10 మందితో జాబితాను వెల్లడించింది హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ. అత్యుత్తమ పనితీరు కనబరిచిన అగ్రశేణి కంపెనీల చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ల జాబితాలో.. ఏకంగా ముగ్గురు భారత సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. ఈ ఏడాది టాప్‌–100 ప్రపంచ సీఈఓల్లో అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌ 6వ స్థానంలో నిలిచారు.

ఆ తరువాత స్థానంలో మాస్టర్‌ కార్డ్‌ చీఫ్‌ అజయ్‌ బంగా ఉండడం విశేషం. కాగా తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల 9వ ర్యాంకులో నిలిచారు. తొలి పది స్థానాల్లో ముగ్గురు భారత సంతతి వారు ఉండగా.. పూర్తి జాబితాలో డీబీఎస్‌ బ్యాంక్‌ పియూష్‌ గుప్తా 89వ స్థానంలో నిలిచి మొత్తం భారత సంతతి సంఖ్యను నాలుగుకు పెంచారు. గ్లోబల్‌ టాప్‌ 100 జాబితాలో నైక్‌ సీఈఓ మార్క్‌ పార్కర్‌ 20 వ ప్లేస్ లో ఉండగా , జేపీ మోర్గాన్‌ చీఫ్‌ జామీ డిమోన్‌ 23, లాక్‌హీడ్‌ మార్టిన్‌ సీఈఓ మారిలిన్‌ హ్యూసన్‌ 37,  డిస్నీ సీఈఓ రాబర్ట్‌ 55, ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ 66, సాఫ్ట్‌బ్యాంక్‌ సీఈఓ మసయోషి సన్‌ 96  ర్యాంకుల్లో ఉన్నారు. అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ అగ్ర స్థానంలో నిలిచారు.

కామెంట్‌లు